జిల్లా క్షయ నివారణ అధికారి ఈశ్వర్‌రాజ్
వైద్యసిబ్బందితో సమావేశం
ఇచ్చోడ, ఫిబ్రవరి 21 : ఆదిలాబాద్ జిల్లాలో క్షయ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా క్షయ నివారణ అధికారి ఈశ్వర్‌రాజ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను సోమవారం తనిఖీ చేశారు. అనంతరం వైద్య సిబ్బందితో క్షయ నియంత్రణపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయపై ఇంటింటా సర్వే నిర్వహించి 2025 కల్లా నియంత్రణ లక్ష్యంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. రెండు వారాలుగా దగ్గు, జ్వరం, ఆకలి తగ్గడం, రాత్రి వేళల్లో చెమటలు రావడం వంటి లక్షణాలు ఉన్న వారు ప్రభుత్వ దవాఖానల్లో నమూనాలు ఇచ్చినట్లయితే టీ -హబ్ వెహికిల్ ద్వారా సిబినాట్ మిషిన్‌లో పరీక్షలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో వైద్యాధికారులు సాగర్, కావ్యరాజ్, హెల్త్ సూపర్ వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు