ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం
పలు కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరు
ముథోల్, ఫిబ్రవరి 20 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. ముథోల్‌లోని వ్యవసాయ గోదాం లో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం క్వింటాలుకు మద్దతు ధర కింద రూ. 5,230ను అందిస్తున్నదని పేర్కొన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ముథోల్‌లో రూ.10 వేల ఎకరాలు, బాసర మండ లంలో రూ.14 వేల ఎకరాల్లో శనగ పంటను రైతు లు సాగు చేశారని పేర్కొన్నారు. రైతులు నష్టపో కుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుం టున్న దని తెలిపారు. రైతులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటున్నదని పేర్కొన్నారు. ముథోల్ సర్పంచ్ రాజేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు అఫ్రోజ్ ఖాన్, జిల్లా వ్యవసాయాధికారి అంజి ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్‌గౌడ్, మున్నూ రు కాపు సంఘం అధ్యక్షుడు రోళ్ల రమేశ్, కోఆప్షన్ సభ్యుడు మగ్దూమ్, నాయకులు రవీందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, సమీ ఉల్లాఖాన్, మురళి మార్క్ ఫెడ్ అధికారులు పాల్గొన్నారు.
రోహిదాస్ మార్గంలో పయనించాలి
ముథోల్, ఫిబ్రవరి 20 : యువత సంత్ శిరో మణి రోహిదాస్ మహారాజ్ మార్గంలో పయనిం చాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. ముథోల్‌లో సంత్ రోహిదాస్ మహారాజ్ 645 జయంతి వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సంత్ బాబా దేశానికి మార్గదర్శకుడని పేర్కొ న్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. అనంతరం మోచీ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సత్కరించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, సర్పంచ్ రాజేందర్, నాయకులు రోళ్ల రమేశ్, మగ్దూమ్, సంజు, మోచీ సంఘం సభ్యులు సాయిలు, భోజన్న, ముత్యం, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
దైవారాధనతో మానసిక ప్రశాంతత
తానూర్, ఫిబ్రవరి 20 : దైవారాధనతోనే మానసిక ప్రశాంతత, సుఖ:సంతోషాలు కలుగు తాయని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొన్నా రు. హిప్నెల్లిలోని నయాబాదిలో హనుమాన్, శివ లింగనంది విగ్రహమూర్తుల ప్రతిష్ఠాపన కార్యక్ర మానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. దేవతామూ ర్తులకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనం తరం శివానంద్ శివచాచ్య తమలుర్కర్ మహ రాజ అశీర్వదం తీసుకున్నారు. కార్యక్రమంలో స్వామి లక్ష్మణ్ అప్పా, గ్రామ సర్పంచ్ దుప్పే శ్యామ్‌రావ్, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పెర కృష్ణ, డైరెక్టర్ తోట రాము, హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్‌రావు పటేల్, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, టీఆర్ఎస్ నాయకులు చంద్రశే ఖర్, లక్ష్మణ్పటేల్ గ్రామస్తులు పాల్గొన్నారు.