
గర్మిళ్ల, సెప్టెంబర్ 20 : పిడుగుపడి ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాకేంద్రంలో సోమవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్పూర్‌కు చెందిన అందె వెంకటేశ్ కు మారుడు శ్రేయాన్ (18నెలలు) ఆరోగ్యం బాగా లేకపోవడంతో తన భార్య మౌనిక (28)తో కలిసి బైక్‌పై మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లారు. తిరిగి రైల్వే ఓవర్ బ్రిడ్జిపై నుంచి ఇంటికి వస్తుండగా, ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో మౌనిక అక్కడికక్కడే మృతి చెందగా, శ్రేయాన్, వెంకటేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారి ని దవాఖానకు తరలించగా, శ్రేయాన్ అప్పటికే మృతి చెందాడు. వెంకటేశ్ సర్కారు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన వెంకటేశ్‌కు తొమ్మిదేళ్ల క్రితం నస్పూర్‌కు చెందిన మౌనికతో వివాహం జరిగింది. మూడేళ్లుగా నస్పూర్లోనే డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుం టున్నాడు. వెంకటేశ్‌కు ఆరేళ్ల మరో కుమారుడు కూడా ఉన్నాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్ భారతీ హోళికేరి, మంచిర్యాల ఏసీపీ అఖిల్ మ హాజన్ సంఘటనా స్థలాన్ని, ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మృతు రాలి సోదరుడు అరవింద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకన్నగౌడ్ తెలిపారు.