
తలమడుగు, సెప్టెంబర్ 20 : టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్‌గా తోట వెంకటేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సోమవారం నియామక పత్రం అందించారు. మండల కార్యవర్గంతో పాటు అనుబంధ సంఘాల ఎన్నుకున్నారు. మండల కన్వీనర్‌గా తోట వెంకటేశ్, ఉపాధ్యక్షులుగా మగ్గిడి ప్రకాశ్, రాగి దీపక్, సిడాం జనక్, ప్రధాన కార్యదర్శిగా మహేశ్ దేశ్‌ముఖ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మంతె సత్యపాల్, బుజ్జి, బాలాజీ, శాస్త్రీ, సంయుక్త కార్యదర్శులుగా మాధవ రావు, విఠల్, గంగాధర్, ప్రచార కార్యదర్శులుగా నారాయణ, శ్రీకాంత్, కోశాధికారిగా ప్రశాంత్, కార్యవర్గ సభ్యులుగా స్వామి, ప్రభాకర్, దాసు, సునీత, నర్సమ్మ, వెంకట్‌రెడ్డి, రామారావును ఎన్నుకున్నారు. సభ్యులతో పాటు అనుబంధ సంఘాల సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. నూతన కమిటీ అధ్యక్షుడిని ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కిరణ్, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.
కరంజి(టీ)లో ఉద్యమ జ్ఞాపకాల మననం
తెలంగాణ ఉద్యమకాలంలో ధూంధాం కార్యక్రమం మొదటగా కరంజి(టీ)లోనే విజయవంతంగా నిర్వహించడంలో గ్రామస్తుల పాత్ర మరువలేనిదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మననం చేసుకున్నారు. వందశాతంగా టీఆర్ఎస్ పంచాయతీ అయిన ఈ గ్రామమంటే తనకు ప్రత్యేక అభిమానమని చెప్పారు. సోమవారం కరంజి(టీ)ని సందర్శించిన ఎమ్మెల్యే గ్రామస్తులతో ముచ్చటిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. బడిని అభివృద్ధి చేస్తామని హెచ్ఎం ఏలియాకు హామీ ఇచ్చారు. సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ఫోన్లో ఎస్ఈ ఉత్తంజాడేతో మాట్లాడారు. కరంజి(టీ), గుబ్‌డి రోడ్ల మరమ్మతు , వంతెనల నిర్మాణాలు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఆయన వెంట టీఆర్ఎస్ జిల్లా నాయకులు జీ నరేందర్‌యాదవ్, ఎం కల్చాప్ యాదవ్, గ్రామస్తులు ఉన్నారు.
ఇచ్చోడ మండల కార్యవర్గం
టీఆర్ఎస్ ఇచ్చోడ మండల కార్యవర్గాన్ని ఆదిలాబాద్‌లోని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ నివాసంలో సోమవారం ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఏనుగు కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎండీ ముస్తాఫా, సిద్దావార్ వెంకటేశ్, బద్దం పురుషోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నరాల రవీందర్, కోశాధికారిగా బామన్పెల్లి గణేశ్, అధికారి ప్రతినిధిగా అబ్దుల్ అజీమ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా నిమ్మల వెంకట్‌రెడ్డి, గ్యాతం గంగయ్య, గుల్లే ప్రకాశ్, అడె హరిబాబు, ముస్కు గంగారెడ్డి, బత్తుల గంగయ్య, సభ్యులుగా చికిలి గోవర్ధన్, షేక్ జుమ్మా, సలీంఖాన్, జాదవ్ రాహుల్, అక్కపెల్లి సుమన్, షేక్ ఫరీద్, కుంట సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికైన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సత్కరించారు.
ఉట్నూర్ మండల అధ్యక్షుడిగా కందుకూరి రమేశ్
టీఆర్ఎస్ మండల కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా కందుకూరి రమేశ్, ఉపాధ్యక్షులుగా టిబోటే ముకుంద్‌రావు, కేంద్రే ఉత్తం పటేల్, కోడి బలవంత్, జవ్వద్ అన్సారి, ప్రధాన కార్యదర్శిగా సెడ్మకి సీతారాం, అధికార ప్రతినిధిగా మైనొద్దీన్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా రాథోడ్ పరశురాం, మెహరాజ్ఖాన్, సంయుక్త కార్యదర్శులుగా ఒల్లెపు భుజంగ్‌రావు, రవీందర్, న్యాను యాదవ్, ప్రచార కార్యదర్శులుగా వాగ్మారే ధన్‌రాజ్, దుర్గం తబిత, జంగుపటేల్, కోశాధికారిగా పంద్ర మాణిక్‌రావు, కార్యవర్గసభ్యులుగా గంగన్న, ఆత్రం ముకుంద్‌రావు, జాదవ్ సుభాష్, సలీం, స్వామి, కాంబ్లే మంచక్రావు, ఆత్రం భగువంత్రావు ఎన్నికయ్యారు.