ప్రజల సంక్షేమమే కేసీఆర్ విజన్
టీఆర్ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి
కుభీర్‌లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ
కుభీర్, ఫిబ్రవరి 19 : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని టీఆర్ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుబంధు, డీమా, 24 గంటల ఉచిత కరంట్, పింఛన్లతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్న రాష్ట్ర సర్కారేనని అన్నారు. మండలంలోని పార్డి(కే) గ్రామంలో పార్డి(కే)-కస్ర కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ ఆకుల గంగాధర్, ఎంపీటీసీ పంతుల హన్మండ్లుతో కలిసి శనివారం భూమి పూజ చేశారు. అలాగే మహాలక్ష్మీ ఆలయం నుంచి బస్టాండ్ వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆలయ ఆవరణలో కల్యాణ మండపం నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి రూ.30 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. బస్టాండ్ నుంచి మహదేవ్ మందిరం వరకు బైపాస్ రోడ్డు వెంబడి విద్యుత్‌లైన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మన ఊరు-మన బడి కింద 112 పాఠశాలలు ఎంపికవగా, అందులో పార్డి(కే) ప్రాథమిక పాఠశాల ఉందన్నారు. గ్రామంలోని ప్రధాన చౌక్‌లలో 4 హైమాస్ట్ లైట్ల ఏర్పాటు, సీసీ రోడ్డు నిర్మాణానికి మరో రూ.2 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం బాకోట గ్రామానికి చెందిన సింధే పుండ్లీక్కు మంజూరైన రూ.90వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మోహియొద్దీన్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, సింగిల్‌విండో చైర్మన్ గంగాచరణ్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, సాతం రవికుమార్, సాతం శంకర్, గాడేకర్ రమేశ్, నాయకులు అనిల్, పానాజీ విజయ్‌కుమార్, శ్రీరాముల రాజేశ్‌చారి, ఏఎంసీ వైస్ చైర్మన్ జాదవ్ దిగంబర్ పటేల్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ దొంతుల రాములు, మాజీ వైస్ ఎంపీపీ బందెల శంకర్, దొంతుల సాయన్న, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరికలు..
పార్డి(కే) సర్పంచ్ గంగాధర్ ఆయన అనుచరులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. విఠల్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశంలో ఏ పార్టీకీ లేనంత మంది కార్యకర్తలు కేవలం టీఆర్ఎస్లో ఉన్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్, సర్పంచ్ల ఫోరం మండల్యాధ్యక్షుడు న్యాలపట్ల దత్తూగౌడ్, శంకర్ చౌహాన్, తూం రాజేశ్వర్, దత్తురాం కాక, బందెల విఠల్, పల్సి రాజన్న, రాజేందర్, గౌర గంగాధర్, మెంచు పోశెట్టి, దేవన్న, సాతం హన్మండ్లు, దొంతుల సాయన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
భైంసా, ఫిబ్రవరి 19 : స్థానిక విశ్రాంత భవనంలో పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. భోజన్నకు రూ.లక్ష, రాజుబాయికి రూ.1.75 లక్షలు, సునితకు రూ.28 వేలు, గజేందర్‌కు రూ.18,500లు మంజూరవగా, పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, తోట రాము, సూర్యనారాయణ, భోజరాం, దిగంబర్ పటేల్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం..
భైంసాటౌన్, ఫిబ్రవరి 19 : చుచుంద్ గ్రామంలో సిద్ధేశ్వర కల్యాణ మండపం నిర్మాణానికి రూ.20 లక్షలు, చిట్టెపు సంఘ భవన నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేసినందుకు దేగాంలో గ్రామస్తులు ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని సన్మానించారు. నిధుల మంజూరు ప్రొసెడింగ్ లెటర్‌ను ఎమ్మెల్యే గ్రామస్తులకు అందజేశారు. నాయకులు మెరాజ్, ప్రధానోపాధ్యాయులు గంగాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.