మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 21 : ఏషియన్ యూత్ ఉమెన్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఆదిలాబాద్ జిల్లా నుంచి క్రీడాకారిణి ఎంపికవ్వడం గర్వ కారణమని ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్ రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ అన్నారు. జిల్లాకేంద్రం లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జాతీయ స్థాయిలో 200 మంది క్రీడాకారులు పోటీపడగా, సౌతిండియా నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారిణి మడావి కరీనా అని అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో మార్చి 4 నుం చి 16 వరకు నిర్వహించనున్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఫాగ్వారా అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ క్యాంపులో పాల్గొంటుందన్నారు. అనంతరం కజకిస్తాన్‌లోని ఆల్మాటి పట్టణంలో జరిగే తొమ్మిదో ఏషియన్ యూత్ చాంపియన్ షిప్లో ఇండియా తరఫున పాల్గొననుందన్నారు. ప్రస్తు తం కరీనా ఆసిఫాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నదన్నారు. మంచి శిక్షణ ఇచ్చిన ఎన్ఎస్ఎన్ఐఎ స్ హ్యాండ్ బాల్ కోచ్ సునార్కర్ అరవింద్‌ను వారు అభినందించారు. రాష్ట్ర, జా తీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, రాష్ట్ర కార్యదర్శి పవన్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి రమేశ్ రె డ్డి, ఒలింపిక్ కార్యదర్శి రఘునాథ రెడ్డి, కోచ్ దు ర్గం రాజలింగు, పీఈటీలు రాకేశ్, కల్యాణ్ పాల్గొన్నారు.