ఆదిలాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబా ద్ జిల్లాలో చెల్లని రూపాయిగా మారిన ఎంపీ అర్వింద్ ఆదిలాబా ద్ నియోజకవర్గంలో యాత్రలు నిర్వహించి ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెస్తానని ప్రజలకు బాండ్ రాసి ఇచ్చి, ఎంపీ అర్వింద్ మోసం చేశారని గుర్తు చేశారు. యాత్రలెన్ని చేసినా బీజేపీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు.
తనపై రాళ్లదాడులు జరుగుతున్నాయని అంటున్నారని, మోసం చేస్తే ప్రజలు దాడి చే యరా అని ప్రశ్నించారు. జైనథ్ దేవాలయం ప్రాంగణంలో ఎంపీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను విమర్శించే నైతికహక్కు ఆర్వింద్‌కు లేదన్నారు. అడవులపై రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం తీసివేసిందన్నా రు.
మోదీ ప్రభుత్వం ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్-2019 పేరిట అటవీ ప్రాంతాల్లోని గిరిజనులపై అటవీ హక్కులను హరింపజేసే ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. గిరిజనులపై అభిమానం ఉం టే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఇతర బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ఈ చట్టాన్ని అడ్డుకోవాలన్నారు. ఈ చట్టం ద్వారా అదా నీ, అంబానీ లాంటి వారికి గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమల స్థా పన కు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ నివసించే ఆదివాసీలు, ఇతరులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు.
బీజేపీ నాయకులకు దమ్ముంటే కేంద్రం నుంచి జాతీయ విపత్తు నిధులు తేవాలని ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తన పార్టీ నాయకులు, కార్యకర్తల విశ్వాసం కోల్పోయారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు మద్దతు ప్రకటించిన అభ్యర్థికి ఓటు వేయడానికి ఆరుగురు కౌన్సిలర్లు రాకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీ కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. నియోజకవర్గ ప్రజలు తమపై నమ్మకం ఉంచి నాలుగు సార్లు ఎ మ్మెల్యేగా గెలిపించారని, మూడుసార్లు ప్రజల చేతిలో ఓటమి పా లైన పాయల్ శంకర్‌కు తనను విమర్శించే హక్కు లేదన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ముందుగా తన పార్టీ నాయకులకు భరోసా క ల్పించాలని సూచించారు. లైబ్రరీ చైర్మన్ రౌతు మనోహర్, మైనార్టీ నాయకులు యూనిస్ అక్బానీ, పార్టీ పట్టణాధ్యక్షుడు కలాల అ జయ్, కార్యదర్శి అష్రఫ్, నాయకులు మెట్టు ప్రహ్లాద్, నారాయ ణ, తదితరులు పాల్గొన్నారు.