నార్నూర్ ఎంపీపీ కనక మోతుబాయి
ఆశ కార్యకర్తలకు స్మార్ట్ పంపిణీ
నార్నూర్, ఫిబ్రవరి 21 : ఆరోగ్య తెలంగాణలో ఆశ కార్యకర్తల పాత్ర కీలకమని ఎంపీపీ కనక మోతుబాయి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 53 మంది ఆశ కార్యకర్తలకు సోమవారం స్మార్ట్ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను యాప్లో నిక్షిప్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్, హెచ్ఈవో చౌహాన్ నాందేవ్, సిబ్బంది రాజమ్మ, కైలాస్, ఈశ్వర్, నాయకులు కనక ప్రభాకర్, శ్రీరామ్, మహేందర్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్ పీహెచ్సీలో..
గుడిహత్నూర్, ఫిబ్రవరి 21 : ఆశకార్యకర్తలు మెరుగైన వైద్యసేవలు అందించాలని సర్పంచ్ జాదవ్ సునీత సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో 42 మంది ఆశ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు అందజేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి నిలోఫర్, వైద్య సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.