ఇచ్చోడ, జూలై 28: అర్హులందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఇచ్చోడలోని రెవెన్యూ కార్యాలయంలో బుధవారం ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన కొత్త రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నిరుపేదల అభ్యున్నతే ధ్యేయంగా, సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తున్నదని స్పష్టం చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుం బాలకు వరంగా మారాయన్నారు. స్థానిక సర్పంచ్ చౌహాన్ సు నీత, జడ్పీటీసీ కదం సుభద్రాబాయి, ఎంపీపీలు నిమ్మల ప్రీ తమ్ రెడ్డి, తుల శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, కరాడ్ బ్రహ్మానంద్, బాలాజీ, ఎంపీటీసీ శివ కు మార్, గాడ్గె సుభాష్, సుజాత, తహసీల్దార్ అతిఖోద్దీన్, డిప్యూ టీ తహసీల్దార్ జాదవ్ రామారావ్, నాయకులు ముస్తాఫా, సా బీర్, తదితరులు పాల్గొన్నారు.
సంక్షోభంలోనూ సంక్షేమం
కరోనా విపత్కర సమయంలోనూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పడక్బందీగా అమలు చేస్తున్నద ని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్‌లోని తహసీల్ కార్యాలయంలో 460 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డు ధ్రువీకరణ పత్రాలను బుధవారం అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ త్వరలోనే అర్హులందరికీ పెన్షన్లు పంపిణీ చేస్తామన్నారు. వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకుంటామని, అధికారులు ఇప్పటికే నష్ట నివేదికను సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్, నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, రోల్ల రమేశ్, పోతన్నయాదవ్, రవీందర్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ మగ్ధూం, టీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో బుధవారం కొత్త రేషన్‌కార్డులను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పంపిణీ చేశారు. బాసర మండలానికి చెందిన 191 మంది లబ్ధి దారులకు వీటిని అందజేశారు. తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ఐ నా రాయణ, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.
గాదిగూడ మండలంలో..
ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అం దిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గాదిగూడ మండలంలో ని తహసీల్ కార్యాలయంలో రేషన్‌కార్డులు, కల్యాణ లక్ష్మి చెక్కు ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో 119 మందికి కొత్త రేషన్ కార్డులు, 17 మందికి కల్యాణ లక్ష్మి మం జూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పే దలకు ఆహారభద్రత కల్పించేందుకే కొత్త రేషన్‌కార్డులు మం జూరు చేసిందన్నారు. కొత్తపల్లి(జీ),మేడిగూడ,శివనార గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల కురిసిన భారీవర్షాలతో కోతకు గు రైన కల్వర్టులు, వంతెనలు పరిశీలించారు. సంబంధితశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీపీ ఆడ చంద్రకళారాజు, తహసీల్దార్ ఆ ర్కా మోతిరాం, వైస్ ఎంపీపీ యోగేశ్, సర్పంచ్‌లు, టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు అందజే స్తామని జిల్లా అదనపు కలెక్టర్ నటరాజన్ అన్నారు. తాంసి మండలంలోని బండలనాగాపూర్లో తాంసి, భీంపూర్, తలమ డుగు మండలాలకు చెందిన లబ్ధిదారులకు రేషన్‌కార్డులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు కొత్తగా 4400 రేషన్‌కార్డులు మంజూరైనట్లు తెలిపారు. లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచి బియ్యం పంపిణీ చేస్తామన్నారు. లబ్ధిదారులు ఎ లాంటి సందేహాలు ఉన్నా రెవెన్యూ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. డీఎస్వో సుదర్శన్, ఎంపీడీవో ఆకుల భూమ య్య, తహసీల్దార్ సంధ్యారాణి, డిప్యూటీ తహసీల్దార్ తిరుమ ల, ఎన్ఫోర్స్మెంట్ డీటీ పుష్ప, ఆర్ఐ మహేశ్, సర్పంచ్ వెంకన్న, లబ్ధిదారులు పాల్గొన్నారు.