
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 24 : ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని 31వ వార్డులోని అంబేద్కర్‌నగర్ కాలనీలో రూ.20లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనుల ను మంగళవారం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రే మేందర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పాలనలో 67 ఏండ్లలో చేయలేని అభివృద్ధిని టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వ చ్చిన 7 ఏండ్లలో చేసి చూపించిందని స్పష్టం చేశా రు. కానీ ఇంకా అభివృద్ధి జరగడంలేదని ఆ పా ర్టీల నాయకులు విమర్శించడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు రూ. 4,500 కోట్లు తీసుకువచ్చినట్లు చెప్పారు. పట్టణంలో పార్టీలతో సంబంధంలేకుండా అన్ని వార్డు ల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పట్ట ణ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ఎమ్మెల్యే ఫండ్స్‌తో పాటు సీఎం ప్రత్యేక నిధులతోనూ కార్యక్రమాలు చేపడుతున్నామన్నా రు. 31వ వార్డులో ఇప్పటి వరకు రూ.1.20 కోట్ల తో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీ ర్ రంజానీ, కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు అశోక్‌స్వామి, పండ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
డ్రైనేజీ పనుల పరిశీలన..
పట్టణంలోని భుక్తాపూర్‌లో కొనసాగుతున్న డ్రైనేజీ పనులను మధ్యాహ్న సమయంలో ఎమ్మెల్యే పరిశీలించారు. పెద్ద నాలా చుట్టూ డ్రైనేజీ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే మున్సిపల్ నిధులతో డ్రైనేజీ నిర్మిస్తున్నామని తెలిపారు. అనంతరం మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో పనులు నిర్వహించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట స్థానిక కౌన్సిలర్ బండారి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.