నేరడిగొండ జడ్పీటీసీ జాదవ్ అనిల్
పలువురు టీఆర్ఎస్లో చేరిక
నేరడిగొండ, ఫిబ్రవరి 19 : తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్పీటీసీ జాదవ్ అనిల్ అన్నారు. మండలంలోని వాంకిడి గ్రామ ఉపసర్పంచ్ అహ్మద్, పలువురు నాయకులు శనివారం మండల కేంద్రంలో జడ్పీటీసీ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. అందుకు ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి రావడమే నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అడిగం రాజు, వీడీసీ చైర్మన్ మర్ల శ్రీనివాస్, నాయకులు శంకర్, రాజన్న, నజీర్, జాదవ్ వసంత్, యూసఫ్, అలీం పాల్గొన్నారు.