Minister Errabelli | మహిళల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి : మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli | మహిళా లోకాన్ని చైతన్య పరచండి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే సమాజం బాగుపడుతుంది. మహిళల్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు. ఆయనకు అండగా నిలవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 14 : మహిళా లోకాన్ని చైతన్య పరచండి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే సమాజం బాగుపడుతుంది. మహిళల్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు. ఆయనకు అండగా నిలవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని జిల్లాల మహిళా సమాఖ్య పదాధికారుల సమావేశం హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లోని టిఎస్ ఐఆర్డిలో గురువారం జరిగింది.
ఈ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లాల సమాఖ్యల పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నందుకు అభినందనలు.
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో మహిళా సంఘాలు బలోపేతమైనట్లు చెప్పారు. తెలంగా ణలోని ఆడబిడ్డలు దేశంలోని మహిళలందరికంటే ముందున్నారని ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ నల్లాల ద్వారా మంచి నీరు అందిస్తున్నాం.
బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నాం. ఇలా అన్ని రంగాల్లో ముందున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని మంత్రి మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, సెర్ప్ సీఈవో గౌతం, స్పెషల్ కమిషనర్ ప్రదీప్, ఎస్బీఎం డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమిషనర్లు రామారావు, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Actors News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

