వర్కింగ్‌లో వాకింగ్!
వర్క్‌ఫ్రమ్ హోమ్ హ్యాపీగా చేయాలని పర్మిషన్ తీసుకుంటారు. తీరా చేస్తుంటే తెలుస్తుంది ఇంటి నుంచి పని ఎంత భారమో. కొలీగ్స్ ఉండరు. ప్రయాణాలు ఉండవు. శారీరక కదలిక లేకపోవడమే కాదు మనసుకి ఆనందాన్నిచ్చే స్నేహితుల పలకరింపులు, జోష్ పెంచే కబుర్లు కూడా కరువే. అయినా తప్పని విధులు.
వర్క్‌ఫ్రమ్ హోమ్ హ్యాపీగా చేయాలని పర్మిషన్ తీసుకుంటారు. తీరా చేస్తుంటే తెలుస్తుంది ఇంటి నుంచి పని ఎంత భారమో. కొలీగ్స్ ఉండరు. ప్రయాణాలు ఉండవు. శారీరక కదలిక లేకపోవడమే కాదు మనసుకి ఆనందాన్నిచ్చే స్నేహితుల పలకరింపులు, జోష్ పెంచే కబుర్లు కూడా కరువే. అయినా తప్పని విధులు. ఆరోగ్యం, పిల్లలు, ఇతర అవసరాల రీత్యా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవాళ్లు నడకతో కొత్త ఉత్సాహాన్ని, కొంత శక్తిని కూడగట్టుకోవచ్చు. కాబట్టి ఇంటి నుంచే పని చేస్తుంటే మీ పనుల ప్రణాళికను ఇలా మార్చుకోండి.
రోజూ లేచే సమయం కంటే ఒక అరగంట ముందే నిద్రలేవండి. కాఫీ తాగడానికి ముందే పదిహేను నిమిషాలపాటు బయట నడిచి రండి. నడక వల్ల వచ్చిన ఉత్సాహం కాఫీ తాగిన తర్వాత రెట్టింపవుతుంది. బయటికి పోయే అవకాశం లేకుంటే మేడ మీదైనా నడిచే ప్రయత్నం చేయాలి. పూర్తిగా ఇంటికే పరిమితమై ఉండటం వల్ల కలిగే నిరుత్సాహాన్ని ఇది పోగొడుతుంది. డెస్క్ జాబ్ చేసేవాళ్ల శరీర భాగాల్లో కదలిక తక్కువగా ఉంటుంది. రోజులో ఎనిమిది గంటలు కూర్చుని పనిచేసే ఉద్యోగి ప్రతి గంటకు ఒకసారి లేచి అయిదు నిమిషాలు నడవాలి. ఇలా రోజు మొత్తంలో నలభై నిమిషాలపాటు నడిస్తే కాళ్లలో నిలిచిపోయిన రక్త ప్రసరణ మెరుగుపడి వెన్నుపై ఒత్తిడి తగ్గి హుషారుగా ఉంటారు. నడవడం కోసం ప్రత్యేక సమయం పెట్టుకుని నడిస్తే ఫర్వాలేదు. ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కంప్యూటర్ మీద పని ఆపి మాట్లాడాల్సి వస్తుంది. ఈ సమయాన్ని కూడా నడుస్తూ గడిపితే అదనపు ప్రయోజనం ఉంటుంది. అలాగే రోజంతా కూర్చునే పనిచేయకుండా నిల్చొని కూడా పని చేసేందుకు ఏదైనా అవకాశం ఉంటే ప్రయత్నించండి. ఇంట్లో విరామ సమయాల్లో మినీ వర్కవుట్స్, క్విక్ క్లీనింగ్, మొక్కలకు నీళ్లు పోయడం వంటి పనుల వల్ల కూడా బోరింగ్ ఫీలింగ్ పోతుంది. పని బాగా చేసేందుకు మనసు సిద్ధమవుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

