అభిమానుల వెండితెర దేవుళ్లు సినిమా తారలు. ఆ తెర వేల్పులకూ ఓ ఇలవేల్పు ఉంటాడు. చాలా సందర్భాల్లో ఆ దేవుడు వినాయకుడే అయి ఉంటాడు. బాలీవుడ్ బృందానికైతే.. ముంబయిలోని గణేశ్ టెంపుల్ నిత్య దర్శనీయ స్థలం. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, రేఖ.. తారా భక్తగణం జాబితా పెద్దదే. ‘ఈసారి నేను ఇంట్లోనే మట్టి గణపతిని తయారు చేసుకొంటాను. బాల్కనీలో నిమజ్జనం చేస్తాను’ అని సోనాలీ బెంద్రే ఇప్పటికే ప్రకటించింది. ‘ఎకో’దంత ముపాస్మహే.. పర్యావరణ గణపతికి పూజలు చేయమని చెబుతూ కొందరు తారలు పిలుపునిచ్చారు కూడా. చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, సోనూసూద్, అల్లు అర్జున్, నాని, శర్వానంద్, నితిన్… తదితరులు చాలా సందర్భాల్లో గణపతి పట్ల తమ భక్తిని వివరించారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పండగ విశేషాలనూ పంచుకొన్నారు.