ఇంట్లో ఎలుకలు ఉంటే.. ప్రత్యక్ష నరకం చూపిస్తాయి. మూలమూలనా విధ్వంసం సృష్టిస్తాయి. వంటింటి సామగ్రి, విద్యుత్ వైర్లు, పిల్లల పుస్తకాలు.. ఇలా ప్రతిదాన్నీ నాశనం చేసేస్తుంటాయి. వీటిని నివారించడానికి మార్కెట్లో ఎన్నోరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఆ విషపూరిత మందులు.. చిన్నపిల్లలకు హానికరంగా పరిణమిస్తాయి. ఇంట్లో దొరికే వస్తువులతోనే వాటిని తరిమేసే చిట్కాలు కొన్ని ఉన్నాయి.