వానల్లో మొక్కలకు కావాల్సినన్ని నీళ్లు, పోషకాలు లభిస్తాయి. కాబట్టి.. ఈ కాలంలో పెరటి మొక్కలు ఆరోగ్యంగా, ఏపుగా పెరుగుతాయి. అదే సమయంలో బలమైన ఈదురు గాలులకు ఇట్టే వంగిపోతాయి. కొమ్మలు విరిగిపోవడం వల్ల ఇతర మొక్కలూ దెబ్బతింటాయి.
మొత్తంగా.. పెరటితోట మొత్తం చిందరవందరగా తయారవుతుంది. దీన్ని నివారించడానికి.. మొక్కల కత్తిరింపులు చేపట్టాలి. చెట్లకు పొడవైన కొమ్మలు ఉంటే.. కత్తిరించేయాలి. పడిపోయిన కొమ్మలు, ఆకులను తొలగించాలి. కత్తిరింపుల వల్ల మొక్కలకు కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయి. ఫలపుష్పాల దిగుబడి కూడా పెరుగుతుంది. తోటకు కొత్త అందం రావడంతోపాటు మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.