Friendship | సంతోష సమయాల్లోనే కాకుండా కష్టకాలంలోనూ అండగా నిలిచేవాళ్లే ప్రాణస్నేహితులు. కొన్నిసార్లు మన కుటుంబసభ్యుల కంటే కూడా నేస్తాలే ఎక్కువ దగ్గరగా అనిపిస్తారు. ఎంత ప్రాణస్నేహితులైనా కూడా అప్పుడప్పుడు పొరపొచ్చాలు రావడం సహజం. దీంతో మిత్రుల మధ్య ఎడం పెరిగే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని సాధ్యమైనంత తొందరగా స్నేహబంధాన్ని నిలుపుకొనే ప్రయత్నం చేయాలి.