Ice Cream Challenge | మీరు ఐస్‌క్రీమ్ ప్రియులా? మహా ఇష్టంగా తింటారా? నచ్చిన ఫ్లేవర్స్‌ను మరీ మరీ ఆస్వాదిస్తారా? అయితే ఈ అవకాశం మీ కోసమే. హైబిజ్ టీవీ, స్కూప్స్ ఐస్‌క్రీమ్ ‘ద గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీమ్ టేస్టింగ్ చాలెంజ్’ పేరుతో వింతైన పోటీ నిర్వహిస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. కండ్లకు గంతలు కట్టుకుని.. ఐస్‌క్రీమ్ రుచి చూసి ఫ్లేవర్ ఏమిటో చెప్పాలి. ఎన్ని ఫ్లేవర్లను గుర్తిస్తే పోటీలో అంత ముందుకు వెళ్లొచ్చు. పదివేలు, పాతికవేలు, యాభైవేలు, అంతిమంగా.. లక్ష రూపాయల ప్రైజ్‌మనీ గెలుచుకోవచ్చు. పోటీకి సరిగ్గా పదిహేను రోజుల సమయం ఉంది. ఎంట్రీ ఫీజు వంద రూపాయలు. వేదిక హైటెక్స్ హాల్. వివరాలకు: 83409 74747
“buffet | బఫేలో ఏం తినాలి? ఎలాంటి టిప్స్ పాటిస్తే మంచిది?”
ఒకప్పుడు బొగ్గుతోనే పళ్లు తోమేవారు.. ఇప్పుడు అదే బొగ్గుతో కాఫీ, ఐస్‌క్రీంలు తయారీ.. ఎందుకు?”
“custard apple | సీతాఫలాలతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న పాలమూరు మహిళలు..”