e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home జిందగీ థ్యాంక్స్‌.. అమ్మా!

థ్యాంక్స్‌.. అమ్మా!

థ్యాంక్స్‌.. అమ్మా!

హీరో కొడుకు హీరో అనిపించుకోవడం సాధారణమే. హీరోయిన్‌ కూతురు హీరోయిన్‌ కావడమే అరుదు. అలా స్టార్‌ స్టేటస్‌ తెచ్చుకున్నవాళ్లూ లేకపోలేదు. ఆ జాబితాలో కొత్తగా చేరబోతున్నది సుస్మితా సేన్‌ దత్తపుత్రిక రేణీసేన్‌. ఇటీవలే ‘సుత్తాబాజీ’ షార్ట్‌ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రశంసలు అందుకున్నది. ఈ సందర్భంగా రేణీ చెప్పిన సంగతులేంటో చూద్దాం.
చిన్నప్పటి నుంచీ అమ్మతో పాటు ఇండస్ట్రీలో తిరగడంవల్ల సినిమాలపై ఆసక్తి పెరిగింది. నటించాలన్న కోరికా బలపడింది. ‘సుత్తాబాజీ’ షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌ కబీర్‌ ఖురానా నా స్కూల్‌ ఫ్రెండ్‌. ఒకరోజు స్క్రిప్ట్‌ పంపించి, ఆడిషన్‌కి రమ్మన్నారు. పందొమ్మిదేండ్ల దియా క్యారెక్టర్‌ నాకు బాగా నచ్చింది. నాలాగే ప్రేక్షకులు కూడా ఆ క్యారెక్టర్‌కి బాగా కనెక్ట్‌ అవుతున్నారు. ఈ పదిహేను నిమిషాల షార్ట్‌ఫిల్మ్‌తో నాకు మెయిన్‌స్ట్రీమ్‌ ప్రొడక్షన్‌పై కాస్తంత అవగాహన వచ్చింది. నా కెరీర్‌ మొదలుపెట్టేందుకు ఈ చిన్న అడుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. నాకు యాక్టింగ్‌పై ఆసక్తి ఉందన్న విషయం అమ్మకు తెలుసు. ఈ ప్రాజెక్ట్‌ గురించి చెప్పినప్పుడు బాగా ఎంకరేజ్‌ చేసింది.
చదువులో చురుగ్గా: ప్రస్తుతం సైకాలజీ చదువుతున్నాను. నేనెప్పుడూ ‘ఇదొక్కటే చేయాలి.. ఇది మాత్రమే నా లైఫ్‌’ అని కండిషన్లు పెట్టుకోలేదు. ఇప్పుడు, యాక్టింగ్‌లో అవకాశాలు వస్తే స్టార్‌ అవ్వాలనుకుంటున్నాను. రేపటి రోజు పరిస్థితులు కలిసిరాకపోతే సైకాలజిస్ట్‌గా సెటిలవుతానేమో తెలియదు. తర్వాత కూడా చదువుకోవాలనిపిస్తే, కొత్త కోర్సులు చేసి మరో ప్రొఫెషన్‌కి వెళ్లేందుకూ వెనకడుగు వేయను.
అమ్మ చిట్కాలు: బ్యూటీకి సంబంధించి అమ్మ రెండు చిట్కాలు చెబుతూ ఉంటుంది. ఒకటి ఎక్కువగా నీళ్లు తాగాలి. రెండోది ముఖంపై మొటిమలు వస్తే వాటిని అస్సలు ముట్టుకోవద్దు. వీటిని నేను పాటిస్తాను. తోటి ఫ్రెండ్స్‌కీ చెబుతాను. థ్యాంక్స్‌ అమ్మా!
హాబీస్‌: నాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. సైకాలజీ పుస్తకాలతో పాటు ఇంగ్లిష్‌ నవలలు చదువుతాను. కథక్‌ నృత్యం, సంప్రదాయ సంగీతం నేర్చుకున్నాను. ఇప్పటికీ సాధన చేస్తుంటాను. అలాగే నాకు బద్ధకం, నిద్రపిచ్చి వంటి చెడు అలవాట్లు ఉన్నాయి. వాటికి త్వరగా దూరమవ్వాలని ప్రయత్నిస్తున్నాను. అలాగే అమ్మలో ఒక మంచిగుణం ఉంటుంది. తను అవతలివాళ్ల టైమ్‌కి కూడా గౌరవం ఇస్తుంది. దాన్ని నేను ఇప్పుడిప్పుడే అలవర్చుకుంటున్నాను. భవిష్యత్‌లో అమ్మలాగే మంచి నటిగా పేరుతెచ్చుకుంటూ.. నా వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తున్నా.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
థ్యాంక్స్‌.. అమ్మా!

ట్రెండింగ్‌

Advertisement