సుప్త వజ్రాసనం | రక్తప్రసరణ పెరిగేందుకు ఈ ఆసనం ఎంతో మేలు చేస్తుంది
supta vajrasana | ఈ ఆసనం ( Yogaasana ) వేయాలంటే, ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి. అంటే, రెండు కాళ్లనూ వెనక్కి ముడుచుకొని, పాదాలు పిరుదుల కిందికి తీసుకోవాలి. శరీరాన్ని కాస్త పైకెత్తాలి. వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.

- ఇప్పుడు, రెండు చేతులను చిత్రంలో చూపినట్టు వెనక్కి తీసుకోవాలి. చేతివేళ్లు శరీరం వైపు ఉండేలా అరచేతులను నేలపై ఉంచాలి.
- నిదానంగా మెడ కింద, నడుం పైన ఉండేలా శరీర భాగాన్ని పైకి లేపాలి. దీంతో శరీరం ఏటవాలుగా మారుతుంది. ఈ సమయంలో ఛాతీ బరువు భుజాలపై పడుతుంది.
- తల వెనక్కి చూసేలా మెడ సాగదీయాలి. దృష్టి వెనకవైపు ఉండేవిధంగా జాగ్రత్తపడాలి.
ఈ ఆసనస్థితిలో.. నిదానంగా ఐదు నుంచి ఆరుసార్లు శ్వాసక్రియ కొనసాగించాలి.
ప్రయోజనాలు
ఛాతీ విశాలం అవుతుంది. శ్వాసక్రియ మెరుగు పడుతుంది. వెన్నెముక, భుజాలు బలంగా తయారవుతాయి. వెన్నెముక, థైరాయిడ్ గ్రంథి ప్రాంతాల్లో రక్త ప్రసరణ సరిగ్గా సాగేందుకు సుప్త వజ్రాసనం దోహదం చేస్తుంది. కానీ, డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆసనం ప్రయత్నించాలి. మధ్యలో అసౌకర్యంగా అనిపిస్తే ఆపేయాలి.
– అనితా అత్యాల , ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు, 6309800109
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఊర్ధ వజ్రాసనం | గర్భిణులు ఇలా చేస్తే వెన్నునొప్పి తగ్గిపోతుంది
వీరాసనం | కాన్పు తర్వాత ఈ ఆసనాలు వేస్తే ఎన్నో లాభాలు
అమ్మో ! సూర్య నమస్కారాలు చేస్తే ఇన్ని లాభాలున్నాయా?
అర్ధ ఉత్తానాసనం : గర్భిణులు ఈ ఆసనం వేస్తే ఇన్ని లాభాలా..
Simhasanam in Yoga | సింహాసనంతో థైరాయిడ్ సమస్యకు అడ్డుకట్ట
నీటిపై ఆసనాలు.. అలలపై విన్యాసాలు.. అబ్బురపరుస్తున్న పెద్దపల్లి జిల్లావాసి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

