Sujani Embroidery | బిహారీ మహిళల సంప్రదాయ వస్త్రకళ ‘సుజని ఎంబ్రాయిడరీ’. సూదీదారంతోనే అద్భుతాలు సృష్టిస్తారు బిహారీ మగువలు. అప్పుడే పుట్టిన శిశువుల కోసం.. ఇంట్లోని పాత దుస్తులను కూర్చి అందమైన దుస్తులు తయారుచేసే ప్రయత్నంలో పుట్టిందే సుజని. రంగురంగుల బట్ట ముక్కలను జతచేస్తూ.. ఆ అతుకు తెలియకుండా పైనుంచి దారంతో దట్టంగా పూలు, ఆకులు, జంతువులు.. ఇలా రకరకాల ఆకారాలను తీర్చిదిద్దుతారు. ఈ హస్తకళ ఫ్యాషన్ ప్రపంచంలో హల్చల్ చేస్తున్నది. జీన్స్ ప్యాంట్లు, కోట్లపై కొలువుదీరి యువతులను ఆకట్టుకుంటున్నది. సుజని ఎంబ్రాయిడరీ చేసిన దుపట్టాలు, కుర్తాలకూ మంచి ఆదరణ ఉంది. నేహాసింగ్ అనే మహిళ ఒక గంటలోనే సుజని కుట్టు నేర్చుకోవడం ఎలా? అన్న అంశంపై ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్నది.
“Sankranti special | పండుగ అయినా పేరంటాలైనా లంగావోణిదే హవా”
khada dupatta | ఒకప్పుడు మొఘల్ రాణులకే పరిమితమైన ఈ ఖాడా దుపట్టా గురించి తెలుసా”
ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా మహిళలు ఇష్టపడేది చీరకట్టే.. మరి వాటిలో లేటెస్ట్ డిజైన్ ఏంటో తెలుసా”
firaun | ఈ కశ్మీరీ ఫ్యాషన్ మొఘలాయిల నుంచి ట్రెండింగ్నే”