Medha Shankar | షార్ట్ ఫిల్మ్, రీల్స్, వ్లాగ్స్.. ఇలా టాలెంట్ నిరూపించుకునేందుకు అనేక ప్లాట్‌ఫామ్స్ వచ్చేశాయి. వాటిలో పాపులర్ అయితే చాలు ఇండస్ట్రీలో కూడా అవకాశాలు బాగానే అందుతున్నాయి. ‘విత్ యు ఫర్ యు ఆల్వేస్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా పరిచయమైంది మేధా శంకర్. ‘షాదిస్తాన్’ సినిమా చేసింది. అవేమీ ఆమెకు అనుకున్నంత పాపులారిటీ తెచ్చిపెట్టలేదు.
2023లో చేసిన ‘ట్వల్త్ ఫెయిల్’ మేధకు అనూహ్య విజయాన్ని కట్టబెట్టింది. ఆ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ట్వల్త్ ఫెయిల్ సినిమాకు ముందు కూడా మూడు పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కాకపోతే వేరే వాళ్లతో వాటిని రీప్లేస్ చేశారు. ఎప్పటికైనా మంచి అవకాశాలు వస్తాయని పాజిటివ్‌గా ఎదురుచూశాను. అదే నా విజయ రహస్యం.
హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, ఆలియా భట్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. తెరవెనుక కూడా వాళ్లు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. వారిని స్ఫూర్తిగా తీసుకుంటా. సినిమాలు, సిరీస్‌లు ఎందులోనైనా నటిస్తా. ట్వల్త్ ఫెయిల్ సినిమాలో నా క్యారెక్టర్‌కు చాలామంది కనెక్ట్ అయ్యారు. ఆ తరహా పాత్రలకే పరిమితం కాకూడదని భావిస్తున్నాను. మంచినటిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా కల’ అని చెబుతున్నది మేధ.