వానాకాలం వచ్చిందంటే.. పెద్దల సంగతేమో కానీ, పసిపిల్లలకు మాత్రం పరీక్షే! హాయిగా అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారులు వాతావరణ మార్పుల వల్ల తీవ్రమైన ఇబ్బందులకు గురవుతుంటారు. వాతావరణంలో తేమ, పొడిబారని దుస్తుల కారణంగా వారి శరీరంపై దద్దుర్లు తలెత్తుతాయి. కొందరు చిన్నారుల్లో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వానాకాలంలో పిల్లలు వెచ్చగా, హాయిగా గడపాలంటే ఈ కింది జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే..