మూగజీవాల్ని పెంచుకునే వాళ్లకు.. వాటితో ప్రగాఢమైన అనుబంధం ఉంటుంది. అవి పంచే ప్రేమ ముందు ప్రపంచంలోని అనుబంధాలన్నీ చిన్నబోవాల్సిందే. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే.. పెండ్లి చేసుకొని వెళ్లి పోతున్న ఓ వధువు కాళ్లకు అడ్డంపడి మరీ..
వెళ్లొద్దంటూ ఓ కుక్కపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. నవ వధువు కూడా.. ఆ ప్రేమకు కరిగిపోయి ఉద్వేగ బాష్పాలు రాల్చింది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘జంతువులు కూడా అన్ని విషయాలనూ అర్థం చేసుకుంటాయి. ఆత్మీయుల్లా స్పందిస్తాయి’ అనే ట్యాగ్‌లైన్ జోడించారు.