Music | సంగీతానికి, పరీక్షల్లో విద్యార్థుల మార్కులకు ప్రత్యక్ష సంబంధం ఉందంటారు నిపుణులు. మిగిలినవారితో పోలిస్తే.. సంగీతాన్ని ఆస్వాదిస్తూ చదువుకునేవారు పరీక్షలు బాగా రాసి, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారట. న్యూయార్క్‌కు చెందిన ఓ పరిశోధన సంస్థ రెండు వేలమందితో ఓ సమగ్ర సర్వే నిర్వహించింది.
ఆహ్లాదకరమైన సంగీతాన్ని వింటూ చదువుకునేవారికి, నిశ్శబ్దంగా చదువుకునేవారికి మధ్య మార్కుల విషయంలో చాలా తేడా ఉండటం గమనించారు నిపుణులు. సర్వేలో పాల్గొన్న 18 నుంచి 25 ఏండ్ల విద్యార్థులలో 50శాతం మంది వరకూ చదువుకునేటప్పుడు పాటలు వినడం తమకు ఇష్టమని చెప్పారు. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుందని, అలసట తెలియదని వెల్లడించారు. సంగీతం జ్ఞాపకశక్తినిచ్చే ఔషధంలా పనిచేస్తుందని అంగీకరించారు.