వర్షాకాలంలో ప్రకృతికాంత సరికొత్తగా ముస్తాబవుతుంది. సందర్శనకు రా రమ్మని ఆహ్వానిస్తుంది. అందుకే.. ఈ కాలంలో ‘నేచర్ టూరిజం’ టాప్ గేర్లో దూసుకెళ్తుంది. కానీ, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిద్దామని వెళ్తే.. ‘ఫుడ్ పాయిజన్’ ప్రమాదం పొంచి ఉంటుంది. తేమతో నిండిపోయే ఈ వాతావరణంలో.. ఆహారం త్వరగా పాడవుతుంది. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ క్రమంలో, వర్షాకాలపు ప్రయాణాల్లో ఫుడ్ పాయిజన్ బారిన పడకుండా ఉండాలంటే.. ఈ సూచనలు పాటించండి.