Viral Video | ఆకలి రాజ్యంలో ‘కూటి కోసం కూలి కోసం’ పాటను గుర్తుకుతెచ్చే విషాద చిత్రమిది. తల్లిమాటను చెవినబెట్టక బయలుదేరిన బాటసారి కాదీమె. కన్నపేగును వీపున మోస్తూ, బతుకు బాధ్యత మోస్తున్న బాటసారి ఆమె. కడుపుకట్టుకుని బతికే పేదరికంలో బిడ్డ భవిష్యత్ కోసం గుండె దిటవు చేసుకుని బతుకుపోరాటంలో గెలుస్తుందో అమ్మ.
‘ఎంత కష్టం ఈ పేదతల్లికి’ అంటూ లోకం ఆమెకు సంఘీభావం ప్రకటిస్తున్నది. జగదీశ్ భాన్ఖోడియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో జూలై 16 నాటికి 90 మిలియన్ల వీక్షణలు, 7 లక్షల లైక్స్‌తో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షించింది. సోషల్ మీడియాలో మిలియన్ల మంది ప్రశంసలు, అభినందనలు అందుకుంటున్నది. ఆ తల్లి కష్టం తీరాలన్న నెటిజన్ల మాట నిజమవ్వాలని మనమూ కోరుకుందాం.