Maang Tikka Jewellery | చెవులకు చక్కని జుంకాలు, ముక్కుకు ముచ్చటైన ముక్కెర, మెడనిండా మెరిసిపోయే హారాలు, చేతులకు గాజులు, ముంజేతికి వంకీలు, నడుముకు వడ్డాణం, పాదాలకు పట్టీలు.. ఇలా నఖశిఖం నగలు ధరిస్తేనే అలంకరణ పూర్తయినట్టు. అయినా, ముస్తాబు చేసుకునేవారికి నుదురు నదురుగా కనిపించదా? అక్కడ కూడా ఏదైనా నగసింగారించుకోవాలనిఅనిపించదా? నిజానికి, తలకట్టు ఆభరణాల చరిత్ర దీర్ఘం, సుదీర్ఘం..
అలనాటి వంటలే కాదు దుస్తులు, నగలు కూడా ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. అప్పటి డిజైన్లే మేకోవర్ చేసుకుని నేటితరాన్ని ఆకట్టుకుంటున్నాయి. పెద్దపెద్ద హారాలు, కడియాలు, రత్నాలు, పగడాలు పొదిగిన భారీ ఆభరణాలంటే ముచ్చటపడుతున్నారు ఆధునిక మహిళలు. ప్రాచీన కాలంనుంచీ పాపిటబిళ్ల మన సంప్రదాయ ఆభరణమే. దానికితోడు నుదుటిపై పట్టీ ధరించేవారు. రానురానూ ఆ నగ పరిమాణం తగ్గిపోయింది. పాపం, పాపిటబిళ్ల ఒంటరిదైపోయింది. అదృష్టంకొద్దీ ఈ మధ్యకాలంలో నుదుటిపై ధరించే పట్టీలాంటి నగ బాగా ప్రచారంలోకి వచ్చింది. చారిత్రక సినిమాల్లో తళుక్కుమన్న ఈ లలాటహారం సెలెబ్రిటీల పెండ్లిళ్లలోనూ సందడి చేస్తున్నది.
బాలీవుడ్ తార అలియా భట్ తన పెండ్లికి అలంకరించుకున్న నగలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. నుదుటిపై నిండైన వజ్రాల పట్టీని ధరించిందా వెండితెర బంగారుబొమ్మ. రవివర్మ ప్రాణంపోసిన దేవీదేవతల చిత్రాలలోనూ ఈ తరహా అలంకరణ కనిపించేది. జువెలరీ డిజైనర్లు.. ఆధునిక దుస్తులపై ధరించేందుకు వీలుగా రకరకాల ఆకృతుల్లో నుదుటి పట్టీలను తయారుచేస్తున్నారు. బంగారం, వెండి, ప్ల్లాటినమ్ వంటి ఖరీదైన లోహాలే కాకుండా వన్‌గ్రామ్ గోల్డ్తోనూ లభిస్తున్నాయి. ఈ హంగులేవీ లేకపోయినా.. సాధారణ గొలుసులనూ అందంగా తలకు చుట్టుకోవచ్చు. ‘కేజీఎఫ్-2’లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి నుదుటిపై ఈ నగ తళుక్కున మెరిసింది. కాబట్టే అంత క్రేజు, అంత మోజు!
అతివలు అంతగా ఇష్టపడి ధరించే ఆమ్రపాలి నగల స్పెషాలిటీ ఏంటి?”
“One Gram Gold Jewellery | వన్‌గ్రామ్ గోల్డ్ నగలను ఇప్పుడు మీకు నచ్చినట్టుగా చేయించుకోండి!!”
“Unfinished Jewelry | చివర్లను కలపకుండా సగంలో వదిలేయడమే ఇప్పుడు ఫ్యాషన్”
“Jewelry | చేతితో ప్రాణంపోసిన ఆభరణాలు ఎందుకంత ప్రత్యేకం !!”