తనపై వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్‌పై అదిరిపోయే రిప్లయ్ ఇచ్చింది బాలీవుడ్ నటి కరిష్మా తన్నా. ‘పాజిటివ్‌గా ఉండండి. సోషల్ మీడియాను ఎదుటివారి ఎదుగుదల కోసం ఉపయోగించండి. వారిని తొక్కేయడానికి కాదు’ అంటూ ఘాటుగా స్పందించింది. ఇటీవలి బొంబాయి టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో.. డిజైనర్ లెహంగా వేసుకొని ర్యాంప్‌వాక్ చేసింది కరిష్మా. స్టయిలిస్ట్, డిజైనర్ అయిన అభినిసా మీనన్.. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘బ్యాడ్ స్టయిలింగ్‌కు ఈ వీడియో మంచి ఉదాహరణ’ అంటూ క్యాప్షన్ పెట్టింది. అందులో కరిష్మా బొద్దుగా కనిపిస్తున్నదనీ, ఆమె నడుముకు రెండువైపులా ఉబ్బిపోయినట్లు కనిపిస్తున్నదనీ రాసుకొచ్చింది.
‘ట్రెండ్స్‌ను ఫాలో అయ్యేముందు టైలరింగ్‌ను ఫాలో కావాలి’ అంటూ హితబోధ చేసింది. ఈ వ్యాఖ్యలపై కరిష్మా కూడా ఘాటుగానే స్పందించింది. ‘మీ దగ్గర ఎక్కువ ఖాళీ సమయం, ఇంకా ఎక్కువ నెగెటివిటీ ఉన్నట్లుంది. అందుకే, ఇలాంటి చౌకబారు పోస్ట్‌లు పెడుతున్నారు. ఇలాంటివారికి ఎప్పుడూ పక్కవారిమీదే ధ్యాస. ఆమె బరువు తగ్గిందనో.. ఆమె అందంగా కనిపిస్తోందనో.. ఆమె బొటాక్స్ చేయించుకుని ఉండాల్సిందనో.. ఆమె బరువు పెరిగిందనో.. కామెంట్ చేస్తుంటారు. కానీ, ఎదుటివారికీ మనసుంటుందనీ, దానిని నొప్పించకూడదని మాత్రం తెలియదు’ అంటూ విమర్శించింది.
పాజిటివ్‌గా ఉండమంటూ సలహా ఇచ్చింది. దీన్ని చూసిన కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ పెడుతుంటే.. మరికొందరు కరిష్మాకు మద్దతుగా నిలుస్తున్నారు. 2001లో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన కరిష్మా తన్నా.. నటిగా, మోడల్‌గా రాణిస్తున్నది. 2014లో బిగ్ బాస్-8 ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇందులో మొదటి రన్నరప్‌గా నిలిచింది. 2020లో ఫియర్ ఫ్యాక్టర్ : ఖత్రోన్ కే ఖిలాడి-10లో విజేతగా నిలిచింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. 2006లో వచ్చిన దోస్తీ : ఫ్రెండ్స్ ఫరెవర్ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. హన్సల్ మెహతా నెట్‌ఫ్లిక్స్ టీవీ సిరీస్.. స్కూప్ (2023)లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు
అందుకుంది.