Janhvi Kapoor | అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీకపూర్.. స్వీట్స్‌పై మనసు పారేసుకుంది. తాజాగా, తన ఇన్‌స్టా హ్యాండిల్లో ‘మాల్పువా, రబ్డీ’ ఫొటోను షేర్చేసి.. ‘హైదరాబాద్‌లో ఈ స్వీట్స్ ఎక్కడ దొరుకుతాయో చెప్పండి ప్లీజ్!’ అంటూ రాసుకొచ్చింది. ఇంట గెలిచి, రచ్చ గెలవాలని చూస్తున్న జాన్వీ.. బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్నది.
ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా, సానా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నది. అటు హిందీలోనూ.. వరుణ్ ధావన్ సరసన ‘సన్నీ సంస్కారీకి తులసి కుమారి’, సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి చేస్తున్న ‘పరమ్ సుందరి’ సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ – ముంబయి మధ్య చక్కర్లు కొడుతున్నది.
ఖాళీ చిక్కినప్పుడల్లా సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులతో ఏదో ఒక అప్డేట్ను పంచుకుంటున్నది. ఇటీవలే కేరళలో ‘పరమ సుందరి’ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన కొన్ని సరదా సంఘటనలను పంచుకున్నది. సూర్యుడి కింద ప్రశాంతమైన పడవ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా, హైదరాబాద్‌లోనూ మాల్పువా – రబ్డీ (స్వీట్) ఫొటోను షేర్చేసి.. ‘హైదరాబాద్‌లో ఈ స్వీట్స్ ఎక్కడ దొరుకుతాయో చెప్పండి!’ అంటూ రాసుకొచ్చింది.