ఇద్దరక్క చెల్లెండ్లు ఉయ్యాలో
ఒకదారి నడువంగ ఉయ్యాలో
అక్కకు దొరికింది ఉయ్యాలో
కుచ్చుల దండ ఉయ్యాలో
అక్క నీకెక్కడిదె ఉయ్యాలో
ఈ కుచ్చులదండ ఉయ్యాలో
కూడెల్లి మల్లన్న ఉయ్యాల్లో
పంపిన దండ ఉయ్యాలో
పర్వతాల మల్లన్న ఉయ్యాలో
పంపిన దండ ఉయ్యాలో
వేములవాడ రాజన్న ఉయ్యాలో
వేసిన దండ ఉయ్యాలో
వేములవాడ రాజన్న ఉయ్యాలో
ఎక్కడుంటాడో ఉయ్యాలో
గుండంలో స్నానమాడి ఉయ్యాలో
గుళ్లె ఉంటాడు ఉయ్యాలో
పేదరాసి పెద్దమ్మ ఉయ్యాలో
చిన్న కోడలిని ఉయ్యాలో
చిన్న కోడలు వయితె ఉయ్యాలో
ఎందుకొచ్చినావు ఉయ్యాలో
సంతానము లేక ఉయ్యాలో
వచ్చినాను స్వామి ఉయ్యాలో
ఇచ్చెటోడు ఈశ్వరుడు ఉయ్యాలో
రాసేది బ్రహ్మ ఉయ్యాలో
శివుని దగ్గరకు పోయి ఉయ్యాలో
చిట్టి రాయించి ఉయ్యాలో
చిట్టిల ఉన్నడే ఉయ్యాలో
నా చిన్ని బాలుడు ఉయ్యాలో
నా చిన్ని బాలునికి ఉయ్యాలో
పాలు లేవాయే ఉయ్యాలో
వసుదేవుడిచ్చిండు ఉయ్యాలో
ఈ వరద కాలువ ఉయ్యాలో
పరమాత్ముడిచ్చిండు ఉయ్యాలో
పాడి ఆవుల మంద ఉయ్యాలో.