Glamate | హైదరాబాద్‌కు చెందిన చలసాని షర్మిలా గాయత్రి అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసింది. ఆ సమయంలో అమెరికా నుంచి హైదరాబాద్‌కు ఎన్నోసార్లు ప్రయాణించాల్సి వచ్చింది. అక్కడి వాతావరణం, జీవనశైలి అనుకూలించకపోవడంతో చర్మం రంగుమారింది, దద్దుర్లు పుట్టాయి. దీంతో చాలామంది చర్మవ్యాధి నిపుణులను సంప్రదించింది. టాప్ రేటింగ్ ఉన్న ఉత్పత్తులు వాడింది. అయినా ఫలితం కనిపించలేదు. పైగా కొత్త సమస్యలొచ్చాయి. దీంతో తన సమస్యకు తానే పరిష్కారం వెతుక్కుంది. తనలా సున్నిత చర్మం ఉన్న ఎంతోమందికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ (ఏఐ) ద్వారా సరైన పరిష్కారం చూపిస్తున్నది గాయత్రి.
‘గ్లామేట్’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించి.. దానికి ఏఐ సాంకేతికతను జోడించింది. చర్మం, కేశాల సమస్యలను అధ్యయనం చేయడం ప్రారంభించింది. వర్చువల్ కౌన్సెలర్ అడిగే క్విజ్‌కు సమాధానం ఇస్తూ పోతుంటే.. మన చర్మం, కేశాల సమస్యను గుర్తించి పరిష్కార మార్గాలను సూచించడంతోపాటు అనువైన ఉత్పత్తులు, మందుల జాబితా తెరమీద ప్రత్యక్షం అవుతుంది. మార్కెట్‌తో పోలిస్తే.. వాటి ధరలు కూడా తక్కువే.
“Shocking | ఎండలో పడుకుంటే.. ఆ అమ్మాయి నుదుటి చర్మం ప్లాస్టిక్‌లా మారిపోయింది!”