ప్రస్తుతం చాలామంది మహిళల్లో నోటి అల్సర్లు కనిపిస్తున్నాయి. ఒత్తిడి, నిద్రలేమి, విటమిన్ లోపంతోపాటు నెలసరి సందర్భంగా హార్మోన్లలో మార్పుల వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తున్నది. కారణాలు ఏవైనా.. నోటి అల్సర్లతో తీవ్రమైన నొప్పితోపాటు నీరు తాగడానికీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే, ఈ సమస్యకు అల్లోపతి మందులకు బదులుగా.. వంటింటి చిట్కాలతోనే పరిష్కారం చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు.