వంటింట్లో.. గుండె భద్రం!
ఆరోగ్యంగా ఉన్నామని అనుకునేవాళ్లనూ హఠాత్తుగా గుండెలు పిండేస్తున్నాయ్. ఈ ప్రాణాంతకమైన సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. ‘గుండెపోటుకు సమస్య గుండెలో లేదు.
ఆరోగ్యంగా ఉన్నామని అనుకునేవాళ్లనూ హఠాత్తుగా గుండెలు పిండేస్తున్నాయ్. ఈ ప్రాణాంతకమైన సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. ‘గుండెపోటుకు సమస్య గుండెలో లేదు. మీ కిచెన్‌లో ఉంది. కాబట్టి మార్చాల్సింది కిచెన్‌ని’ అని నిపుణులు సలహా ఇస్తున్నారు. వంటింట్లో చేసే అయిదు రకాల పొరపాట్లే ప్రాణానికి పెద్ద ముప్పుగా మారుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ అయిదు పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడితే మీ హృదయం పదిలంగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.
- నూనె మితంగా వాడాలి. అలా జరగాలంటే కూరల్లో నూనె తక్కువగా పోయాలి. అవసరమైతే వేపుళ్లు తగ్గించాలి. నూనెలో వేయించే టిఫిన్లు, స్నాక్స్ ప్రతి రోజూ వండటం మానుకోవాలి.
- ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు మార్కెట్లో అమ్ముతున్నారు.. వాటిని కిచెన్‌లోకి రానివ్వొద్దు.
- చుట్టమొస్తే మర్యాదకని సాఫ్ట్ డ్రింక్స్‌తో ఫ్రిజ్ నింపుతున్నారు. ఆరోగ్యపరంగా ఇది అమర్యాద. అతిథులకు కాదు అందరి ఆరోగ్యానికీ మంచిది కాదు. కొన్ని పానియాలు ఫ్రూట్స్‌తో చేసినవని అమ్ముతారు. వాటిల్లోనూ చక్కెర అధిక మోతాదులో ఉంటుంది. ఇవి కూడా ప్రమాదమే. కావాలనుకుంటే పండ్ల రసాలు చేసుకుని తాగాలి.
- రీఫైన్డ్ చేసిన పిండితో తయారయ్యే రొట్టె, పాస్తా, మైదా మొదలైన వాటిని కిచెన్‌లోకి రానివ్వొద్దు.
- ప్రాసెస్ చేసిన మాంసం కూడా గుండెకు హాని చేస్తుంది.
ఈ అయిదు రకాల పదార్థాల వల్ల లక్షణాలు బయటికి కనిపించకుండానే ఇన్సులిన్ నిరోధకత, ఇన్ఫ్లమేషన్, వెసరల్ ఫ్యాట్ పెరుగుతుంది. వీటి వల్ల గుండె కవాటాలు పాడవుతాయి. దీర్ఘకాలం తర్వాత హఠాత్తుగా గుండెపోటు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అయిదింటి విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించండి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

