ఆయుర్వేదంలో ‘నేరేడు’ది ప్రత్యేక స్థానం. దీని పండ్లు మాత్రమే కాదు.. ఆకులు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అనేక ఔషధ గుణాలతో నిండిన నేరేడు ఆకులు.. వివిధ వ్యాధులను నివారించడంలో సమర్థంగా పనిచేస్తాయని చెబుతున్నారు.
నేరేడు ఆకులను నమలడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి.
వీటిలోని ఆయుర్వేద సమ్మేళనాలు.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. నేరేడు ఆకుల కషాయం తాగితే.. విరేచనాలు ఇట్టే తగ్గిపోతాయి. కాలేయం పనితీరు కూడా మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలూ తగ్గిపోతాయి.
నేరేడు ఆకుల్లో యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలం. ఇవి రక్తంలో చక్కెర విడుదలను నియంత్రిస్తాయి. దాంతో, షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అలా.. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. భోజనానికి ముందు.. ఓ టీస్పూన్ నేరేడు ఆకుల రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
నేరేడు ఆకుల రసంలో కొద్దిగా ధనియాలు వేసి తాగితే.. జ్వరం తగ్గిపోతుంది.