జీవనశైలి లోపాలతో ఇప్పుడు చాలామందిలో చిన్నవయసులోనే నెత్తి నెరుస్తున్నది. దాంతో.. జుట్టుకు రంగు వేసుకోవడం అనివార్యం అవుతున్నది. అయితే.. ‘హెయిర్ డై’ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదని పలు అధ్యయనాల్లో తేలింది. హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్ వంటివీ దాడిచేసే ప్రమాదం ఉన్నది.
ఈ క్రమంలో జుట్టుకు రంగు వేసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు నిపుణులు.