Health news | ప్రోటీన్లు ఎక్కువగా తీసుకున్నా ఆరోగ్యానికి ముప్పే.. మరి ఏవి ఎంత తీసుకోవాలి?
Health news | ఆరోగ్యకరమైన జీవితానికి ఆహారంలో తగినన్ని ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలనే విషయం తెలిసిందే. దీంతో చాలామంది ప్రొటీన్లు మంచివని ఆహారంతోపాటు ఎలాంటి సూచన లేకుండానే సప్లిమెంట్లు, ప్రొటీన్ పదార్థాలను ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. అయితే, ప్రొటీన్లు తక్కువైతే ఆరోగ్యానికి ఎంత ముప్పు ఉంటుందో... ఎక్కువైనా అంతే సమస్య! కాబట్టి, రోజువారీ ఆహారంలో ప్రొటీన్లు ఎంత మోతాదులో ఉండాలో తెలుసుకుంటే మంచిది.
Health news | ఆరోగ్యకరమైన జీవితానికి ఆహారంలో తగినన్ని ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలనే విషయం తెలిసిందే. దీంతో చాలామంది ప్రొటీన్లు మంచివని ఆహారంతోపాటు ఎలాంటి సూచన లేకుండానే సప్లిమెంట్లు, ప్రొటీన్ పదార్థాలను ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. అయితే, ప్రొటీన్లు తక్కువైతే ఆరోగ్యానికి ఎంత ముప్పు ఉంటుందో… ఎక్కువైనా అంతే సమస్య! కాబట్టి, రోజువారీ ఆహారంలో ప్రొటీన్లు ఎంత మోతాదులో ఉండాలో తెలుసుకుంటే మంచిది.
- ఆరోగ్యంగా ఉన్న పెద్దలు తమ శరీర బరువులో ఒక కిలోగ్రాముకు 0.75 నుంచి 0.80 గ్రాముల (ఒక గ్రాము కంటే తక్కువే) ప్రొటీన్లు తీసుకోవాలనేది నిపుణుల అభిప్రాయం. సుమారుగా చెప్పాలంటే రోజుకు పురుషులైతే 55 గ్రాములు, స్త్రీలు 45 గ్రాముల ప్రొటీన్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అయితే… వయసు, లింగం, శారీరక శ్రమ, ఆరోగ్య స్థితి మీద ఈ లెక్క ఆధారపడి ఉంటుంది. అథ్లెట్లు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సూచన మేరకు వారికి తగిన మోతాదులో ప్రొటీన్లు తీసుకోవాలి.
- ఇక రోజువారీగా ప్రొటీన్ల ద్వారా 10 నుంచి 35 శాతం క్యాలరీలు లభించాలి. ఈ మోతాదు దాటితే ఊబకాయం, కిడ్నీ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ మధ్యకాలంలో ప్రొటీన్ పదార్థాలు, సప్లిమెంట్ల వాడకం కూడా పెరిగింది. ముఖ్యంగా యువతరంలో ఈ ధోరణి కనిపిస్తుంది. అయితే, నిపుణుల సూచన లేకుండా ప్రొటీన్ సప్లిమెంట్లు వాడకూడదు. సరైన మోతాదులో తీసుకోకపోతే శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, కిడ్నీ సమస్యలు, కండరాల సమస్యలు, మలబద్ధకం, జీవక్రియలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయి.
- కాబట్టి ప్రొటీన్ సప్లిమెంట్ల మీద ఆధారపడే బదులు రోజువారీ ఆహారం నుంచే తగినన్ని ప్రొటీన్లు దొరికేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు, గింజలు, చిక్కుడు జాతి గింజలు, టోఫు, సోయాబీన్, చేపలు, పాల ఉత్పత్తులు, ముతక ధాన్యాలు ప్రొటీన్ల గనులు. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

