ముచ్చటైన చీరకు చూడచక్కని వాలుజడ తోడైతే ఆ అందం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే అవుతుంది. సిగ అల్లికల అలంకారం కోసం నాగరం నుంచి జడకుప్పెల దాకా ఎన్నెన్నో నగలు మేమంటే మేమని పోటీ పడుతుంటాయి. ఇక్కడ కండ్లను కట్టిపడేసేలా కనిపిస్తున్నది కిషన్దాస్ జువెలరీ సంస్థ రూపొందించిన మేలిమి బంగారు జడ.
బర్మీస్ రూబీ, పోల్కీలను జతచేసిన ఈ జడకు చివర జడకుచ్చులు అందంగా వేలాడేలా రూపొందించారు. మీనం ఆకృతిలో వచ్చే డిజైన్ దీనికి ప్రత్యేక ఆకర్షణ. దానిపైన పచ్చలు, కెంపులు, పోల్కీలు పొదిగి చేసిన జడబిళ్లకు రెండు వైపులా ముత్యాలసరాలు ముగ్ధంగా అమరిపోయాయి. ఎంబ్రాయిడరీ చేసిన ఆఫ్వైట్ రంగు చీర రితికా మీర్చందానీ కలెక్షన్లోనిది.