హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తక పాశమంకుశ ధరాం సగ్భ్రూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం॥
త్రిపురుని భార్య త్రిపురసుందరీ దేవి. అంటే పరమేశ్వరుని అర్ధాంగి అయిన గౌరీదేవి అని అర్థం. త్రిపురాత్రయంలో బాలాత్రిపురసుందరీ దేవి తొలి దేవత. అందుకనే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని రెండో రోజున బాలాత్రిపురసుందరీ దేవిగా అలంకరణ చేస్తారు. మనస్సు, బుద్ధి, అహంకారం అమ్మ అధీనంలో ఉంటాయి. ఈ తల్లి అభయహస్తం, వరదముద్ర ప్రదర్శిస్తూ అక్షమాల ధరించి ఉంటుంది. ఈమెను ఆరాధించటం వల్ల నిత్య సంతోషం కలుగుతుంది. శ్రీచక్ర సంప్రదాయంలో షోడశీ విద్యకు తానే అధిదేవత. రెండు నుంచి పదేండ్ల వయసులోపు బాలికలను బాలాత్రిపురసుందరీ దేవి స్వరూపంగా అర్చించి, సకల సుమంగళ ద్రవ్యాలు, నూతన వస్ర్తాలు ఇవ్వాలి. తల్లి అనుగ్రహం వల్ల కొత్త దంపతులకు సత్సంతానం కలుగుతుంది. అమ్మకు పాయసం నివేదనగా సమర్పించాలి.