e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home జిందగీ ‘శారీ’ జహాసె అచ్ఛా..

‘శారీ’ జహాసె అచ్ఛా..

‘శారీ’ జహాసె అచ్ఛా..

సంప్రదాయానికి చిరునామా చీర. అందుకే, ఈతరం అమ్మాయిలు పండుగ పబ్బాల్లో చీరలు సింగారించుకొని తళుక్కుమంటున్నారు. ఆధునిక హంగులు అద్దుకున్నవాటిని మరీ ఎక్కువ ఇష్టపడుతున్నారు. వెస్ట్రన్‌ ప్లస్‌ కలంకారి జతగా ట్రెడిషనల్‌ హ్యాండ్‌ పెయింట్‌ మెర్సిడైజ్డ్డ్‌ హ్యాండ్లూమ్‌ కాటన్‌ చీరల డిజైన్లేమిటో చూద్దాం..

ఎవర్‌గ్రీన్‌ బ్లాక్‌…

పట్టు ఫ్యాబ్రిక్‌పై కలంకారి సొగసు
లద్దిన చీర ఇది. ప్లెయిన్‌ బ్లాక్‌ చీరపై అనేక రంగుల్లో ఏనుగులు, ఎద్దులు, నెమళ్లు, చిలుకలు, హంసల చిత్రాలు చక్కగా కనబడేలా పైనా కిందా పది అంగుళాల హెవీ బార్డర్‌ ఇచ్చారు. బార్డర్‌ ఫినిషింగ్‌లో నాలుగంగుళాల గ్రీన్‌ లైన్‌ ఇవ్వడంతో బ్లాక్‌ అండ్‌ గ్రీన్‌ కాంబినేషన్‌ హైలైట్‌ అయ్యింది. చీరకు నప్పేలా షర్ట్‌ పాటర్న్‌లో ఫుల్‌ నెక్‌, ఫుల్‌ హ్యాండ్స్‌ పఫ్‌తో వైట్‌ బ్లౌజ్‌ మరింత ట్రెండీగా కనిపిస్తున్నది. చీరకు కాంట్రాస్ట్‌గా డిజైన్‌ చేసిన బ్లాక్‌ టై డిఫరెంట్‌గా ఉంది.

‘రాయల్‌’ .. బ్లూ

- Advertisement -

మెర్సిడైజ్డ్‌ హ్యాండ్లూమ్‌ కాటన్‌పై బ్లాక్‌ కలర్‌ లైన్స్‌ డిజైన్‌తో హ్యాండ్‌ పెయింట్‌ వేసిన చీర ఇది. భిన్న రంగుల్లో అద్దిన పూలు, ఆకులు, నెమళ్ళ డిజైన్‌ హైలైట్‌ అయ్యేలా.. పది అంగుళాలతో పెద్ద బార్డర్‌ ఇచ్చారు. చివర్లో గోల్డ్‌ కలర్‌ ఫినిషింగ్‌ ఉండటంతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. చీరతోపాటు బ్లౌజ్‌ను కూడా ట్రెండీగా డిజైన్‌ చేశారు. బ్లాక్‌ కలర్‌ ఫుల్‌ నెక్‌ క్రాప్‌ టాప్‌పై గోల్డ్‌ మెటల్‌ లీవ్స్‌ ఉన్న బ్రోచర్‌ని జతచేశారు. బ్లాక్‌ కలర్‌ నెట్టెడ్‌ ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసిన పఫ్‌ హ్యాండ్స్‌ ట్రెండీ లుక్‌ ఇస్తున్నాయి. చీరకు నప్పేలా రూపొందించిన గోల్డెన్‌ కలర్‌ ఫ్యాబ్రిక్‌ బెల్ట్‌ అదనపు ఆకర్షణ.

రితీషా రెడ్డి
ఇషా డిజైనర్‌ హౌస్‌, follow us on: instagram.com/
riteshareddy, 70136 39335

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘శారీ’ జహాసె అచ్ఛా..
‘శారీ’ జహాసె అచ్ఛా..
‘శారీ’ జహాసె అచ్ఛా..

ట్రెండింగ్‌

Advertisement