నీరు జీవనాధారం. మనిషి బతకాలంటే.. నీరు తాగడం చాలా అవసరం. అయితే, అప్పుడప్పుడూ మనం తీసుకునే ద్రవాల కన్నా.. మన శరీరం ఎక్కువ మోతాదులో ద్రవాలను కోల్పోతుంది. అప్పుడు బాడీ డీహైడ్రేట్ అవుతుంది. సరిపడా నీరు తాగకపోవడం, శరీరం ఎక్కువగా నీటిని కోల్పోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. పెద్దవాళ్లలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది.
పెద్దవాళ్లు డీహైడ్రేషన్‌కు గురైతే.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. నిర్లక్ష్యంగా ఉంటే.. కాలేయం, మూత్రపిండాలు, గుండె తదితర అవయవాలపై ప్రభావం పడుతుంది. ఇలాంటి సమస్యలు ఎదురుకావొద్దంటే.. తరచూ నీళ్లు తీసుకుంటూ ఉండాలి. దాహం వేయకున్నా.. గంటగంటకూ నీళ్లు తాగడం
అలవాటుగా చేసుకోవాలి.