Health Tips | ఈ ఆహార పానీయాలతో బరువుకు చెక్ పెట్టొచ్చు
జీవక్రియలు సజావుగా సాగినప్పుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కానీ, కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతిపదిమందిలో ఏడుగురు అయితే అజీర్ణ సమస్యతో లేదంటే అధిక బరువుతో బాధపడుతున్నారట. వీళ్లలో చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నవాళ్లే! అయితే, కొన్నిరకాల ఆహార పానీయాలతో బరువుకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు.
Health Tips | జీవక్రియలు సజావుగా సాగినప్పుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కానీ, కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతిపదిమందిలో ఏడుగురు అయితే అజీర్ణ సమస్యతో లేదంటే అధిక బరువుతో బాధపడుతున్నారట. వీళ్లలో చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నవాళ్లే! అయితే, కొన్నిరకాల ఆహార పానీయాలతో బరువుకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. వీటివల్ల జీర్ణక్రియ సమస్యలను నియంత్రించొచ్చు అని చెబుతున్నారు. అవేంటంటే..
సోంపు పానీయం: మృష్టాన్న భోజనం తర్వాత సోంపు తింటే.. జీవక్రియ వేగం హెచ్చుతుందని మనకు తెలిసిందే! గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసి మరగనివ్వాలి. తర్వాత వడగట్టుకొని, చల్లారాక తాగాలి. దీనివల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పొట్ట ఉబ్బరం తగ్గి, జీవక్రియలు వేగవంతమై బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

కొకుం జ్యూస్: కొకుం పండులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలోని వేడిని తగ్గించడంతోపాటు తక్షణ శక్తిని ఇస్తుంది. దీన్ని సమ్మర్ సూపర్ ఫ్రూట్గా అభివర్ణిస్తారు కూడా! కొకుం జ్యూస్తో ఎసిడిటీ తగ్గుతుంది. అజీర్తితో బాధపడుతున్న వాళ్లు కొకుం జ్యూస్ తాగితే ఉపశమనం పొందొచ్చు. శరీరంలోని చెడు కొవ్వు నిల్వల్ని ఇది నివారిస్తుంది.

తులసి టీ: వాకిటి కోటలో నిలిచిన తులసి ఆరోగ్యప్రదాయిని. రోగనిరోధకశక్తిని పెంచడంలో తులసి ఉత్పత్తులు క్రియాశీలకంగా పనిచేస్తాయి. తులసి టీ క్రమం తప్పకుండా తాగితే జీవక్రియ మెరుగుపడుతుంది. కొవ్వును తగ్గించడంతోపాటు ఊబకాయాన్నీ తులసి టీ నిరోధిస్తుంది.

బార్లీ టీ: బార్లీలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ఆకలిని తగ్గిస్తుంది. బార్లీ నీటిని తాగడం ద్వారా శరీరంలో కేలరీలు ఖర్చవడంతోపాటు జీవక్రియ మెరుగుపడుతుంది. రెగ్యులర్గా బార్లీ టీ తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది.

అలోవెరా జ్యూస్: శరీర బరువు తగ్గించడంలో కలబంద బలంగా పనిచేస్తుంది. భోజనానికి 15 నిమిషాల ముందు ప్రతి రోజూ ఒక టీ స్పూన్ అలోవెరా జ్యూస్ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. జీవక్రియల వేగం పెంచడంతోపాటు కొవ్వును నియంత్రిస్తుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

