Zouk Bags | చెప్పులు, పర్సులు, బ్యాగులు, దుస్తులు… ఇలా లెదర్‌తో తయారయ్యే వస్తువులు అనేకం. అయితే, తోలు సేకరణ పేరుతో జరుగుతున్న జంతు హింసను చూసి కదిలిపోయి.. ప్రత్యామ్నాయాన్ని వెదికారు దిశాసింగ్ ( Disha Singh ). ఆ ఆలోచనలో నుంచే ‘జౌకా’ అనే వేగన్ లెదర్ యాక్సెసరీ సంస్థ ప్రాణం పోసుకుంది.
ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేసే సమయంలో సహ విద్యార్థులతో కచ్ ప్రాంతానికి వెళ్లారు దిశ. ఆమె స్నేహితులకు అక్కడి హ్యాండ్‌మేడ్ బ్యాగులు చాలా నచ్చాయి. కానీ నాణ్యత లేకపోవడంతో కొనలేదు. ఇదే విషయం దిశ మనసులో ముద్ర పడిపోయింది. జీవ హింసకు తావు లేకుండా.. భారతీయత ఉట్టిపడే యాక్సెసరీస్ తయారు చేసే సంస్థను స్థాపించాలని అనుకున్నారు. అలా భర్త ప్రదీప్ కృష్ణకుమార్‌తో కలిసి ‘జౌక్’ను నెలకొల్పారు. తయారీలో పైనాపిల్ ఆకులు, ఆపిల్ చెక్కు, పండ్ల వ్యర్థాల్లాంటి రకరకాల వృక్ష సంబంధ పదార్థాలతో చేసిన కృత్రిమ తోలును ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాలలో రీసైకిల్డ్ ప్లాస్టిక్, లీయురేథెన్ వాడతారు. అయితేనేం, అచ్చమైన లెదర్ ఉత్పత్తులను పోలి ఉంటాయి. వాటి మీద ఉండే ప్రింట్లు, పువ్వులు, మోటిఫ్‌లు, డిజైన్లు.. అన్నీ భారతీయతను ప్రతిబింబిస్తాయి. అవసరమైన చోట ఇక్కత్, జూట్, ఖాదీ వస్త్రాలనే ఎంచుకుంటారు. ఈ సంస్థకు మంచి ఫండింగ్ కూడా వచ్చింది.
“మీరు హ్యాండ్ బ్యాగ్ ప్రియులా? ఈసారి ‘ఈనా’ బ్యాగులు ప్రయత్నించండి”
“నటాషా పూనావాలా హ్యాండ్ బ్యాగ్ ఖరీదు 82 లక్షలట..”
“పీరియడ్స్‌లో సమస్యలా? ఈ యోగాసనాలు వేస్తే మంచిదట!!”
We Hub | మహిళల వ్యాపార ఆలోచనలకు రూపమిస్తూ.. స్టార్టప్‌లకు ప్రాణం పోస్తున్న వీహబ్”