We Hub | మహిళల వ్యాపార ఆలోచనలకు రూపమిస్తూ.. స్టార్టప్‌లకు ప్రాణం పోస్తున్న వీహబ్
We Hub | ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఇన్వెస్టర్లను రప్పిస్తుంది. మార్కెట్‌ను పరిచయం చేస్తుంది. విశ్వ విపణికి దారి చూపుతుంది. కొత్త అవకాశాలను చేరువ చేస్తుంది. ఆలోచన నుంచి అద్భుత విజయం వరకూ.. మహిళలను వేలు పట్టుకుని నడిపిస్తున్నది వీహబ్. ఈ నాలుగేండ్లలో ఆ ఆవరణలో ప్రాణంపోసుకున్న స్టార్టప్స్ అనేకం.
వీ హబ్ గత నాలుగేండ్లలో..మహిళల వ్యాపార ఆలోచనలకు రూపమిచ్చి.. పెట్టుబడికి ఊతమిచ్చిన మొత్తం రూ. 69 కోట్లు.
వీహబ్ వేదికగా.. అల్లుకుపోయిన ఆంత్రప్రెన్యూర్లు అక్షరాలా 5,235 మంది. ఈ నాలుగేండ్ల కాలంలోనే 2,194 స్టార్టప్స్, చిన్నతరహా పరిశ్రమలు వీహబ్ ద్వారా సాయం పొంది పోటీ ప్రపంచంలో తలెత్తుకొని నిలబడ్డాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకున్నవారు ఇంకొన్ని వేల మంది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత.. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా.. మంత్రి కేటీఆర్ ఆలోచనలకు రూపమిస్తూ.. ప్రభుత్వం నాటిన విత్తనమే ‘వీహబ్’. అది మొక్కయి.. మహా వృక్షంగా మారి.. మన ఆడబిడ్డలకు ప్రతి ఫలాలను అందిస్తున్నది. ఇన్నాళ్లూ హైదరాబాద్‌కే పరిమితమైన వీహబ్ సేవలు త్వరలోనే రాష్ట్రం నలుమూలలా అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణలో నాలుగు ప్రధాన జిల్లా కేంద్రాలకూ వీహబ్ విస్తరించనుంది. హైదరాబాద్‌లో అదనంగా మరో కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. యువతులను విద్యార్థి దశ నుంచే ఆంత్రప్రెన్యూర్‌షిప్ దిశగా ప్రోత్సహించాలన్నది వీహబ్ ఆలోచన. ఈ వేదికను జిల్లాలకూ విస్తరించడం వల్ల గ్రామీణ మహిళలకు ఎంతో మేలు జరగనుంది. ఇన్నాళ్లూ ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే.. చచ్చినట్టు హైదరాబాద్‌కే రావాల్సి వచ్చేది. ఆ ప్రయాణమంతా వ్యయప్రయాసలతో కూడుకొని ఉండేది. ప్రాజెక్ట్ రిపోర్ట్ పట్టుకుని బ్యాంకులు, కార్పొరేట్ కంపెనీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇక ఆ కష్టాలు ఉండవు.
స్టార్టప్ ఎక్సేంజ్
ఈ నాలుగేండ్లలో వీహబ్‌కు అనుబంధంగా ఉన్న స్టార్టప్‌లను వర్గీకరించి, వాటి స్థాయిని నిర్ధారించి.. సర్టిఫికేషన్ ఇవ్వనున్నారు. దీని ద్వారా స్టార్టప్‌ల యజమానులకు అధికారిక గుర్తింపు దక్కుతుంది. ఏ స్థాయిలో ఎలాంటి సహాయం కావాలన్నా అందుతుంది. వీటితోపాటు, అంతర్జాతీయ స్టార్టప్ ఎక్సేంజ్ కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నది. ‘ఇంటర్నేషనల్ స్టార్టప్ ఇనీషియేటివ్’లో భాగంగా వీహబ్‌కు అనుబంధంగా ఉన్న అంకుర సంస్థల కోసం అంతర్జాతీయ మార్కెట్‌ను గుర్తించి.. అక్కడ మనవాళ్ల వ్యాపారాన్ని విస్తరించేందుకు వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్నారు అధికారులు. దీని ద్వారా తెలంగాణ మహిళల ప్రతిభ విశ్వవ్యాప్తం అవుతుంది.
లాంచ్‌ప్యాడ్ ఈవెంట్స్..
మార్కెట్ అనుసంధానం కోసం వీహబ్‌కు దరఖాస్తు చేసుకున్న స్టార్టప్‌లలో అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేసి, ఇన్వెస్టర్లతో ముఖాముఖి ఏర్పాటుచేస్తారు. ఇటీవల నిర్వహించిన లాంచ్‌ప్యాడ్ కార్యక్రమానికి 152 మంది మహిళా ఆంత్రప్రెన్యూర్స్ దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 42 స్టార్టప్‌లను ఎంపిక చేశారు. ఇక పెట్టుబడి, ఫండింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న 27 స్టార్టప్ నిర్వాహకులతో మాట్లాడి.. 14 మంది ఇన్వెస్టర్లతో ముఖాముఖి నిర్వహించారు. అంతిమంగా 11 స్టార్టప్‌లకు అవకాశం ఇచ్చారు. వీరిలో ఇన్వెస్టర్లను మెప్పించిన వారికి తక్షణమే పెట్టుబడి అందుతుంది. పలుదశల వడపోతలో తిరస్కారానికి గురైన స్టార్టప్స్‌ను అక్కడితోనే వదిలేయకుండా.. ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఆ కలను సాకారం చేసుకోవాలంటే మళ్లీ ఎక్కడినుంచి మొదలు పెట్టాలి? అనే అంశాలపై మెంటర్స్ గైడ్ చేస్తారు.
ఆలోచన ఉంటే వెన్నంటే..
ఓ మంచి వ్యాపార ఆలోచనతో వీహబ్‌ను సంప్రదిస్తే.. ఐడియా ఏ దశలో ఉంది? అది కార్యరూపం దాల్చాలంటే ఎలాంటి సహకారం కావాలి? ఇన్వెస్టర్లను ఎలా ఆకర్షించాలి? డబ్బు చేతికందిన తర్వాత సంస్థ ఏర్పాటు.. ప్రొడక్ట్ మార్కెటింగ్.. నగదు నిర్వహణ, ఈ-కామర్స్ సైట్ నిర్వహణ.. ఇలా ప్రతి విషయంలోనూ, ప్రతి దశలోనూ వెన్నంటే ఉంటుంది వీహబ్. అంకుర ఆలోచన నుంచి విజయ తీరాలకు చేరేవరకూ తోడుగా నిలుస్తుంది.
ఇన్వెస్టర్లు సిద్ధం
వీహబ్ ద్వారా తెలంగాణలోని మహిళా పారిశ్రామికవేత్తలకు అవసరమైన పెట్టుబడి అందించేందుకు ఇన్వెస్టర్లు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. వీరిలో వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజెల్ ఇన్వెస్టర్లు ఉన్నారు. స్టార్టప్ ఆలోచన నచ్చితే రూ.8 కోట్ల నుంచి రూ.14 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు సిద్ధంగా ఉన్నారు. పెట్టుబడి స్థాయి పెరిగినా కూడా, ఆలోచన నచ్చితే.. నలుగురైదుగురు ఇన్వెస్టర్లు ఒక గ్రూప్ (ఏంజెల్స్)గా ఏర్పడి స్టార్టప్‌లో పెట్టుబడి పెడుతున్నారు. బ్యాంకుల నుంచీ పెట్టుబడి దారి చూపిస్తున్నాం. అవసరాన్ని బట్టి వీహబ్ ఫండ్స్ నుంచి కూడా అందిస్తున్నాం. వీహబ్‌తో కలిసి పనిచేసేందుకు యాభై నాలుగు మంది ఇన్వెస్టర్లు ఆమోదం తెలిపారు. వారిని మెప్పిస్తే.. కావాల్సినంత పెట్టుబడి!
– దీప్తి రావుల, సీఈఓ, వీహబ్
… డప్పు రవి, ఫొటోలు : చిన్న యాదగిరి గౌడ్
Read More :
“ఏడు పదుల వయసులో పెయింటింగ్ నేర్చుకుని అవార్డులు అందుకుంటున్న బామ్మ”
“ఫోర్బ్స్ మెచ్చిన లేడీ బాస్.. ఇంతకీ ఎవరామె !!”
Kamathipura Post Office | కామాటిపురలోని సెక్స్ వర్కర్ల జీవితంలో వెలుగు తీసుకొస్తున్న పోస్టాఫీస్”
టాలీవుడ్ మొదలు బాలీవుడ్ స్టార్స్ అందరితో ఇన్‌స్టా రీల్స్ చేయించగలిగే ఈ అమ్మాయి ఎవరో తెలుసా!!”
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- inspiration
- Start up
- WE HUB
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

