Kamathipura Post Office | కామాటిపురలోని సెక్స్ వర్కర్ల జీవితంలో వెలుగు తీసుకొస్తున్న పోస్టాఫీస్
Kamathipura Post Office | ముంబైలోని కామాటిపుర. గల్లీనంబర్-8. ఇక్కడ డెలివరీ బాయ్స్ కనిపించరు. ఏటీఎమ్‌లు లేవు. బ్యాంక్‌లు ఉండవు. సెక్స్ వర్కర్లను మనుషులుగా గుర్తించే ప్రయత్నమూ జరగలేదని చెప్పడానికి ఆధారంగా.. ఒక్క ఆధార్ నమోదు కేంద్రమూ లేదు. చాలాకాలం క్రితం పోస్టాఫీస్‌ను మాత్రం ప్రారంభించారు. అది తమకోసమేనని సెక్స్ వర్కర్లకు తెలియదు. ఈ అవకాశాన్ని వినియోగించుకోమని అధికారులూ చెప్పరు. సిబ్బందికైతే ఇక్కడ పనిచేయడం అంటేనే ఓ శిక్ష కింద లెక్క. ఆ బ్రాంచిలో పనిచేసే బ్రహ్మచారులకు సంబంధాలు రావని ఓ ప్రచారం.
పోస్ట్‌మాస్టర్ జనరల్ స్వాతి రంగ ప్రవేశంతో సీన్ మారింది. ‘గల్లీ నంబర్-8’ శాఖకు కొత్త వెలుగు వచ్చింది. ఇప్పుడు, ఆ శాఖలో మొత్తం మహిళా ఉద్యోగులే. సెక్స్ వర్కర్ల పిల్లలకు ఆధార్ కార్డులు మంజూరు అయ్యేలా చొరవ తీసుకున్నారామె. దాదాపు 142 మంది సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరారు. ప్రతి నెలా సగటున రూ. 500 డిపాజిట్ చేస్తున్నారు. కొత్తగా 75 పొదుపు ఖాతాలు తెరిచారు. ఎన్జీఓల సహకారమూ తోడైంది. ‘పోస్టాఫీస్ అనేది తపాలా వ్యవహారాలకే పరిమితం కాదు. ఇదొక ఆత్మవిశ్వాస చిరునామా’ అంటారు స్వాతి.
Read More :
“టాలీవుడ్ మొదలు బాలీవుడ్ స్టార్స్ అందరితో ఇన్‌స్టా రీల్స్ చేయించగలిగే ఈ అమ్మాయి ఎవరో తెలుసా!!”
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- inspiration
- Mumbai
- post office
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

