ఫోర్బ్స్ మెచ్చిన లేడీ బాస్.. ఇంతకీ ఎవరామె !!
Archana Rao | అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల అధినాయకత్వ స్థానాల్లో భారతీయుల హవా కొనసాగుతున్నది. మనవాళ్ల సమర్థతను ప్రపంచమంతా గుర్తిస్తున్నది. ఆ జాబితాలో చేరిన మరో ఆణిముత్యం అర్చనా రావ్. తాము పనిచేస్తున్న సంస్థల పనితీరులో గణనీయమైన మార్పులు తీసుకొచ్చి.. లాభాల బాట పట్టించిన సీఐవో (చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)ల చిట్టా.. ‘ద ఫోర్బ్స్ సీఐవో నెక్ట్స్ లిస్ట్:2022’ తాజాగా విడుదలైంది. ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ స్థాయికి ఎదిగిన అర్చనా రావ్‌కు కూడా ఇందులో చోటు దక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన అట్లాషియన్ సంస్థలో తను సీఐవోగా పనిచేస్తున్నారు.
అర్చన కోసమే ప్రత్యేకించి తమ కంపెనీలో ఈ పదవిని సృష్టించింది అట్లాషియన్. మైసూరు యూనివర్సిటీలో ఇంజినీరింగ్ తర్వాత, ఐఐటీ మద్రాస్ నుంచి మాస్టర్స్ పట్టా అందుకున్నారు అర్చన. దాదాపు 20 ఏండ్లుగా టెక్ రంగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. క్రైసిస్ మేనేజ్మెంట్లో అర్చన దిట్ట. తనకున్న సమయంలో యాభైశాతానికి పైగా వినియోగదారులతో చర్చలకే కేటాయిస్తారామె. మనిషి పనిని సులభతరం చేయడమే లక్ష్యంగా టెక్నాలజీని రూపొందించాలని తన సహచరులకు దిశానిర్దేశం చేస్తారు. అలా అర్చన బృందం దాదాపు లక్ష పనిగంటలను ఆదా చేసిందట. 2021 ఆర్థిక సంవత్సరానికి అట్లాషియన్ రాబడి రెండు బిలియన్ డాలర్లను అధిగమించడంలో అర్చనపాత్ర ఎంతో ఉంది.
Read More :
“టాలీవుడ్ మొదలు బాలీవుడ్ స్టార్స్ అందరితో ఇన్‌స్టా రీల్స్ చేయించగలిగే ఈ అమ్మాయి ఎవరో తెలుసా!!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Forbes
- inspiration
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

