Eena Bags | మీరు హ్యాండ్ బ్యాగ్ ప్రియులా? ఎక్కడి కెళ్లినా చేతిలోనో, భుజానికో బ్యాగ్ వేలాడాల్సిందేనా? అయితే, ఈసారి ‘ఈనా’ బ్యాగులు ప్రయత్నించండి. అందులోనూ.. చక్కని ఎంబ్రాయిడరీ, ముత్యాల పట్టీలు, స్ఫటికాలు, రత్నాలు పొదిగిన అందమైన బకెట్ బ్యాగులు, ఆధునిక శైలిలో మెరిసేఈవెనింగ్ క్లచ్లు, పొట్లీస్ మీకు నచ్చి తీరుతాయి. పువ్వులు, పక్షుల డిజైన్లు ఆకట్టు కుంటాయి. ఆన్లైన్ ధరలు రూ.3 వేల నుంచి ప్రారంభం.