కావలసిన పదార్థాలు: మక్కజొన్న పొత్తులు: రెండు, కారం: ఒక టీస్పూన్, వెన్న: ఒక టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత, వెల్లుల్లి పొడి: అర టీస్పూన్, ఉల్లిగడ్డ పొడి: ఒక టీస్పూన్.
తయారీ విధానం: మక్కజొన్న పొత్తులను రెండు అంగుళాల ముక్కల చొప్పున కత్తిరించుకోవాలి. ఒక గిన్నెలో వెన్న, ఉప్పు, కారం, క్రీమ్, వెల్లుల్లి, ఉల్లి పొడి.. అన్నీ వేసి బాగా కలపాలి. కారం మిశ్రమాన్ని మక్కజొన్న ముక్కలకు బాగా పట్టించి పది నిమిషాలు పక్కన పెట్టాలి. వీటిని విడివిడిగా పేర్చి ఓవెన్లోగానీ, ఆవిరి మీదగానీ ఉడికించుకుంటే వేడివేడిగా నోరూరించే కార్న్ బైట్స్ సిద్ధం. ఇష్టపడేవాళ్లు పైనుంచి నిమ్మరసం, కొత్తిమీర తురుము కూడా చల్లుకోవచ్చు. ఆరోగ్యం ప్లస్ రుచీ!