ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు జోరందుకొన్న ట్రెండ్.. బాడీకాన్. తొంభైలలో ఒక ఊపు ఊపేసిన ఈ డ్రస్సింగ్‌కు పూర్వవైభవం వచ్చింది. లాక్డౌన్ తర్వాత పార్టీలు, ఫ్యాషన్ షోలలో బాడీకాన్ డ్రస్సులు హల్చల్ చేస్తున్నాయి. ‘బాడీకాన్’ అంటే బాడీ కాన్షియస్ లేదా బాడీ కాన్ఫిడెన్స్ అని అర్థం. ఇందులో ఉపయోగించే ఫ్యాబ్రిక్ బరువైన మెటీరియల్‌తో శరీరానికి హత్తుకుపోతుంది. వీటిలో అమ్మాయిలు మరింత స్లిమ్‌గా కనిపిస్తారు. బాడీకాన్ డ్రెస్సులు తమలో కాన్ఫిడెన్స్ నింపుతున్నాయని చెబుతున్నారు ఫ్యాషన్ భామలు. ఈ మెటీరియల్‌కు సాగేగుణం ఉండటంవల్ల డిమాండ్ పెరుగుతున్నది. ‘బాలీవుడ్ నటీమణులు బాడీకాన్ డ్రెస్సులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇవి చేతికి గ్లౌజులు ఫిట్ అయినంత పర్ఫెక్ట్గా నప్పుతాయి’ అంటారు డిజైనర్ నచికేత్. పైనుంచి డెనిమ్ జాకెట్ లేదా ఓవర్‌కోట్ వేసుకుంటే ఫార్మల్ లుక్ వచ్చేస్తుంది. రంగురంగుల స్ట్రాప్ హీల్స్ వీటికి చక్కని మ్యాచింగ్.