మియాపూర్: కరోనా వంటి విపత్కర సమయంలో పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించటంలో ఎంటమాలజీ సిబ్బంది సేవలను మరువబోమని,సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలకు రక్షించేందుకు వారు చేస్తున్న యుద్దం గొప్పదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలో ఎంటమాలజీ సిబ్బందికి వ్యక్తిగత కిట్లను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేశ్ గౌడ్లతో కలిసి విప్ గాంధీ శుక్రవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ తమ ప్రాణాలను ఫణంగా పెడుతూ ప్రజల ఆరోగ్యం కోసం పని చేస్తున్న కార్మికుల భద్రత , రక్షణకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని, వారికి అధిక వేతనాలు ఆరోగ్య రక్షణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విధి నిర్వహణలో పాల్గొనే కార్మికులు ప్రభుత్వం 11 రకాల వస్తువులతో అందిస్తున్న కిట్లను సద్వినియోగం చేసుకోవాలని, తమ ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ పరిసరాల పరిరక్షణకు పాటుపడాలన్నారు.
కరోనాతో విపత్కర పరిస్థితుల నెలకొన్న ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడ్డ సందర్భంలోనూ కార్మికులు ఎంతో ధైర్యంతో విధులలో పాల్గొన్నారని విప్ గాంధీ అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సంజీవరెడ్డి, శ్రీనివాస్‌యాదవ్ ,రాజేందర్ , సైదేశ్వర్ ,చంద్రమోహన్ , మోజెస్,పోచయ్య, రాము, శ్రీను,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.